Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, July 28, 2023

About Muharram


 Muharram  మొహర్రం అంటే పండుగ కాదా.. ఈ మాసంలో ముస్లింలు ఎందుకని శుభకార్యాలు నిర్వహించరో తెలుసా...

Muharram  మొహర్రం మాసంలో పదో రోజున పీర్ల దేవుళ్లను ఊరేగిస్తారు. హజరత్ ఇమాం హుసేన్ ను స్మరించుకుంటూ పంజా(పీర్ల దేవుళ్ల ప్రతిమ)లను ఊరేగించి తమ సంతాపం ప్రకటిస్తారు. 

Muharram  ప్రపంచవ్యాప్తంగా ఉండే ముస్లింలందరూ రంజాన్, బక్రీద్ తర్వాత జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో మొహర్రం(పీర్ల పండుగ) ఒకటి. ఈ పవిత్రమైన పండుగను తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ సమయంలో ఇస్లాం మతంలోని ప్రవచనాలు, మహ్మద్ ప్రవక్త బోధనలను వివరిస్తారు. మొహర్రం మాసంలో పదో రోజున పీర్ల దేవుళ్లను ఊరేగిస్తారు. అంతకుముందు రాత్రి అగ్ని గుండంలో దూకడం, అగ్గిలో నడవటం వంటివి చేస్తారు. హజరత్ ఇమాం హుసేన్ ను స్మరించుకుంటూ పంజా(పీర్ల దేవుళ్ల ప్రతిమ)లను ఊరేగించి తమ సంతాపం ప్రకటిస్తారు.  కొన్ని ప్రాంతాల్లో కొందరు ముస్లింలు తమ రక్తంతో శోక తప్త హృదయాలతో తమ వీరులను స్మరించుకుంటారు. మహ్మద్ ప్రవక్త అధర్మాన్ని, అన్యాయాన్ని వ్యతిరేకించి ధర్మం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవనం కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇస్లామిక్ న్యూ ఇయర్ గురించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలను తెలుసుకుందాం...

​మొహ్రర్రం పండుగ కాదు..!

వాస్తవానికి మొహర్రం అనేది పండుగ కాదు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొదటి మాసాన్ని మొహర్రంగా పిలుస్తారు. అయితే ఈ నెలలో పదో రోజును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈరోజున అమరవీరులను స్మరించుకునే దినోత్సవంగా భావిస్తారు. అయితే ప్రాచీన కాలంలో అషూరా రోజున మొహర్రం మాసంలో పదో రోజున అనేక సంప్రదాయాలను అనుసరించి పండుగగా జరుపుకునేవారు.

​ఇస్లామిక్ క్యాలెండర్ ఇలా..

తెలుగు, ఇంగ్లీష్ క్యాలెండర్లు ఎలా అయితే ఉన్నాయో అదే మాదిరిగా ఇస్లామిక్ క్యాలెండర్ ఉంటుంది. 12 నెలలు ఉండే ఇస్లామిక్ క్యాలెండర్ కొంత విభిన్నంగా ఉంటుంది. వీరి క్యాలెండర్లో కేవలం 354 రోజులు మాత్రమే ఉంటాయి. ఈ మాసంలో ఎక్కువ మతపరమైన కార్యక్రమాలను నిర్వహించరు. కొన్ని దేశాల్లో ఈ మొహర్రం రోజున సెలవు ప్రకటిస్తారు.

​చరిత్రను పరిశీలిస్తే..

మొహర్రం మాసంలో మొదటి రోజున ఇరాక్ లోని కర్బలా మైదానంలో యుద్ధం ప్రారంభమైంది. యజీద్ సైన్యం హుసేన్ తో పాటు కుటుంబసభ్యులను, మహిళలను, పసిపిల్లల్ని సైతం దారుణంగా హతమార్చారు. మొహర్రం నెల పదో రోజున సాయంత్రం అల్లా్హ్ ను స్మరించుకుంటూ నమాజ్ చేస్తున్న ఇమాం హుసేన్ ను శత్రు సైన్యం చుట్టుముట్టారు. అప్పుడు శత్రువుల చేతిలో దాదాపు 70 మంది వరకు మహ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వారు అమరులుగా మారిపోయారు. ఈ సమయంలో హజరత్ హుసేన్ ఆ తెగకు శాపం పెడతారు. ఈ తెగకు ఎప్పటికీ మోక్షం ఇవ్వొద్దని ప్రార్థిస్తూ ప్రాణాలు వదిలేస్తాడు. యుద్ధం పూర్తయిన తర్వాత యాజిద్ తెగ వారు పశ్చాత్తాపం చెందుతారు. అప్పటినుంచి తమను క్షమించాలని కోరుతూ గుండెల మీద చేతులతో బాదుకుంటూ గట్టిగా ఏడుస్తూ నిప్పులపై నడిచారు. అదే ఆచారం నేటికీ చాలా ప్రాంతాల్లో కొనసాగుతుంది.

​ఉపవాస దీక్షను..

మొహర్రం మాసంలో పీర్ల పంజా (ప్రతిమ)లను కూర్చోబెట్టిన వారు ఎర్రగా మండే నిప్పు కణికల్లో నడుచుకుంటూ వెళ్తారు. అదే విధంగా మహ్మద్ ప్రవక్త కుటుంబానికి చందిన వ్యక్తులు అమరులైన తమ పెద్దలను తలచుకుంటూ వారికి సంతాపంగా రెండ్రోజుల పాటు ఉపవాస దీక్షను పాటిస్తారు. అలాగే ఈ మాసంలో తమ ఇళ్లలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు.

Thanks for reading About Muharram

No comments:

Post a Comment