Amazon sale: అమెజాన్ నుంచి ఫ్రీడమ్ సేల్.. తేదీలు, ఆఫర్లు ఇవే!
Amazon Great Freedom Festival sale: అమెజాన్ ఫ్రీడమ్ సేల్ నిర్వహించనుంది. ఆగస్టు 5 నుంచి 9 వరకు ఐదు రోజుల పాటు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) మరో ఆఫర్ల పండగకు సిద్ధమైంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ కస్టమర్ల కోసం ప్రైమ్ డే సేల్ నిర్వహించిన ఆ సంస్థ.. త్వరలో మరో సేల్ (Amazon offers) నిర్వహించనుంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌ను (Great Freedom Festival sale) తీసుకొస్తోంది. ఆగస్టు 5 నుంచి 9 వరకు ఈ సేల్ నిర్వహించనున్నారు.
సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు 12 గంటల ముందుగానే ఈ ఆఫర్లను పొందొచ్చు. ఫ్రీడమ్ సేల్‌లో శాంసంగ్, వన్‌ప్లస్, రియల్‌మీ, రెడ్‌మీ వంటి స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు లభించనున్నాయి. కొన్ని ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్ లభిస్తుందని అమెజాన్ పేర్కొంది. స్మార్ట్‌ఫోన్లతో పాటు స్మార్ట్‌టీవీలు, ల్యాప్‌టాప్, వైర్‌లెస్ ఇయర్ బడ్స్, స్మార్ట్ వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సైతం డిస్కౌంట్‌కే అందించనున్నట్లు తెలిపింది. అయితే, ఏయే ఫోన్‌పై ఎంతెంత డిస్కౌంట్ ఇస్తున్నదీ రివీల్ చేయలేదు. సేల్ తేదీలు దగ్గరపడ్డాక ఆ వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ప్రైమ్ డే సేల్‌లో ఆఫర్లను మిస్ అయిన వారు ఈ సేల్‌లో పాల్గొనొచ్చు.
Thanks for reading Amazon sale: Freedom Sale from Amazon.. Dates and offers are
No comments:
Post a Comment