Bank Holidays: ఆగస్టులో 14 రోజులు బ్యాంకులు బంద్.. వెంటనే పనులు పూర్తి చేసుకోండి..
Bank Holidays In August: ప్రతినెల రిజర్వు బ్యాంక్ దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల సెలవులకు సంబంధించిన క్యాలెండర్ విడుదల చేస్తుంది. తాజాగా రానున్న ఆగస్టు మాసంలో బ్యాంకులు ఏఏ రోజుల్లో అందుబాటులో ఉండవో ప్రకటించింది.
రానున్న ఆగస్టు మాసంలో దేశవ్యాప్తంగా బ్యాంకులు ఏకంగా 14 రోజులు సెలవులో ఉండనున్నాయి. బ్యాంక్ సెలవులు ప్రతి రాష్ట్రానికి మారుతుంటాయి. స్థానిక పండుగలకు అనుగుణంగా రిజర్వు బ్యాంక్ దీనిని నిర్ణయిస్తుంది. అయితే అన్నింటి కంటే ముఖ్యమైన స్వాతంత్ర్య దినోత్సవం రాబోదోంది. అందువల్ల చివరి క్షణాల్లో పరుగులు తీయకుండా పనులను ప్లాన్ చేసుకోవటం ఉత్తమం.
ప్రస్తుతం ఫోన్ బ్యాంకింగ్, ఆన్ లైన్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్ వంటి సదుపాయాలు అందుబాటులోకి రావటంతో ఇంటి వద్ద నుంచే పనులు పూర్తి చేసుకునే వెసులుబాటు ఉంది. అందులోనూ బ్యాంకులు సెలవులో ఉన్నప్పటికీ డిజిటల్ రూపంలో పనులను చక్కబెట్టుకోవచ్చు. అయితే కొన్ని రకాల పనులకు మాత్రం నేరుగా బ్యాంక్ శాఖలను సందర్శించాల్సి ఉంటుంది. అందువల్ల చివరి వరకు నిర్లక్ష్యం చేయకుండా బ్యాంక్ సెలవుదినాలను పరిగణలోకి తీసుకుని వాటిని ముందుగానే పూర్తి చేసుకోవటం ఉత్తమం. అలాగే రూ.2000 నోట్లను మార్చుకోవటానికి సెప్టెంబరు 30 వరకు గడువు ఉన్నందున కంగారు పడాల్సిన అవసరం లేదు.
అగస్టులో బ్యాంక్ సెలవులు..
ఆగస్టు 6: నెలలో మొదటి ఆదివారం
ఆగస్ట్ 8: టెండాంగ్ లో రమ్ ఫాత్- గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 12: నెలలో రెండవ శనివారం
ఆగస్టు 13: నెలలో రెండవ ఆదివారం
ఆగష్టు 15: స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్టు 16: పార్సీ నూతన సంవత్సరం- బేలాపూర్, ముంబై, నాగ్‌పూర్‌లలో బ్యాంకులు క్లోజ్
ఆగష్టు 18: శ్రీమంత శంకరదేవుని తిథి- గౌహతిలో బ్యాంకులకు హాలిడే
ఆగస్టు 20: మూడవ ఆదివారం
ఆగస్ట్ 26: నెలలో నాలుగో శనివారం
ఆగస్ట్ 27: నెలలోని నాల్గవ ఆదివారం
ఆగస్ట్ 28: మొదటి ఓనం- కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులకు హాలిడే
ఆగస్ట్ 29: తిరువోణం- కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 30: రక్షా బంధన్- జైపూర్, శ్రీనగర్‌లలో బ్యాంకులు మూసివేత
ఆగస్టు 31: రక్షా బంధన్/శ్రీనారాయణ గురు జయంతి/పాంగ్-లాబ్సోల్- గాంగ్‌టక్, డెహ్రాడూన్, కాన్పూర్, కొచ్చి, లక్నో మరియు తిరువనంతపురంలో బ్యాంకులు క్లోజ్
రాష్ట్రాల పండుగల ఆధారంగా అక్కడ బ్యాంకులు మూసి ఉంటాయి. ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవని గుర్తించుకోవాలి.
ఏ నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయో పూర్తి వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. https://www.rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లింక్ క్లిక్ చేస్తే సెలవుల జాబితా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సర్కిళ్లవారీగా ఈ సెలవుల వివరాలు ఉంటాయి.
Thanks for reading Bank Holidays In August 2023
No comments:
Post a Comment