Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, July 26, 2023

Fridge: If any of these symptoms appear.. you have to buy a new fridge.. how to tell that the fridge is damaged..!


 Fridge: ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా.. కొత్త ప్రిడ్జ్ కొనాల్సిందే.. ఫ్రిడ్జ్ పాడయిపోయిందని ఎలా గుర్తు పట్టాలంటే..!

ఇప్పట్లో ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండటం తప్పనిసరి. వంటింటి అవసరాలకే కాక చల్లనీరు, ఐస్ క్రీమ్ వంటివి తయారు చేసుకోవడానికి కూడా ఫ్రిడ్జ్ లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

కానీ ఇంట్లో ఉపయోగిస్తున్న ఫ్రిడ్జ్ లో కనిపించే కొన్నిలక్షణాల ఆధారంగా ఆ ఫ్రిడ్జ్ జీవితకాలం ముగిసిందని, దాన్ని ఇక మూలన పెట్టకతప్పదని చెప్పవచ్చట. ఆ లక్షణాలు ఏవో తెలుసుకుంటే ఫ్రిడ్జ్ విషయంలో అనవసరంగా చేసే పొరపాట్లు తగ్గుతాయి. ఫ్రిడ్జ్ ల మీద ఓ అవహాహన కూడా వస్తుంది. ఇంతకీ ఆ లక్షణాలేమిటంటే..

ఎంత ఖరీదైన ఫ్రిడ్జ్ లు అయినా వాటి జీవితకాలం 10-15ఏళ్ళు మాత్రమే(Fridge lifetime). ఆ తరువాత ఫ్రిడ్జ్ లు పనిచేయడంలో సమస్యలు వస్తాయి. పనిచేయకుండా మొరాయిస్తాయి. చాలా మందికి ఉన్న వస్తువును రిపేర్ చేయించుకుని వాడటం అలవాటుగా ఉంటుంది. కానీ 10-15ఏళ్ళు దాటిన ఫ్రిడ్జ్ లను రిపేర్ చేయించకుండా వాటి స్థానంలో కొత్తవి కొనడం మంచిది. ఎందుకంటే 10ఏళ్ళు దాటిన తరువాత ఫ్రిడ్జ్ లను రిపేర్ చేయించినా అవి కొన్నిరోజులకే మళ్లీ మొరాయిస్తాయి.

నార్మల్ గా ఫ్రిడ్జ్ వెనుక భాగం వేడిగా ఉంటుంది. కానీ ఫ్రిడ్జ్ అన్నిభాగాలలో వేడెక్కితే(fridge heating) ఆ ఫ్రిడ్జ్ కాలం ఇక ముగిసిందని అర్థం. కాలం ముగిసిన ఫ్రిడ్జ్ లు ఇలాగే వేడెక్కుతాయి.

గమనిస్తే పాత ఫ్రిడ్జ్ లలో కూలింగ్ సమస్య(cooling problem) ఎదురవుతూ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టిన నీళ్ళు తొందరగా చల్లబడవు. ఇక ఐసింగ్ ట్రేలో ఐస్ తయారు కావడానికి కూడా చాలా సమయం పడుతుంది. ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహారం, ఇతర పదార్థాలు సాధారణం కంటే తొందగా పాడైపోతుంటాయి. ఈ కారణంగా ఫ్రిడ్జ్ వాసన వస్తుంటుంది కూడా.

10ఏళ్లు దాటిన ఫ్రిడ్జ్ డీప్ ఫ్రిడ్జ్ లో మంచు కొండలా పేరుకుపోతూ ఉంటుంది(heavy ice problem). దీన్ని ఎన్ని సార్లు పరిష్కరించినా మళ్లీ మళ్లీ ఈ సమస్య ఎదురవుతూ ఉంటుంది. ఈ లక్షణం కూడా ఫ్రిడ్జ్ పాడైపోయిందని సూచించే లక్షణాలలో ఒకటి.

కరెంట్ పోయినప్పుడు, ఫ్రిడ్జ్ లోపల కంప్రెసర్ యాక్టీవ్ అయినప్పుడు ఫ్రిడ్జ్ శబ్ధం(fridge sound) చేయడం కామన్. కానీ ఇలా వచ్చే శబ్దం ఉన్నట్టుండి ఆగిపోవడం, అంతే వేగంగా మళ్ళీ పెద్దగా శబ్దం రావడం జరిగితే ఆ ఫ్రిడ్జ్ పనితీరు మందగించిందని అర్థం.

పై లక్షణాలు ఫ్రిడ్జ్ లో పదే పదే కనబడుతుంటే ఆ ఫ్రిడ్జ్ పాడైపోయిందని అర్థం. దాని స్థానంలో కొత్తది కొనాల్సిందే..

Thanks for reading Fridge: If any of these symptoms appear.. you have to buy a new fridge.. how to tell that the fridge is damaged..!

No comments:

Post a Comment