Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, July 21, 2023

Google Accounts : Do you suspect that your Google Accounts are being viewed by someone other than you? But do this


 Google Accounts : మీ Google Accounts మీరు కాకుండా వేరే వాళ్ళు చూస్తున్నారని అనుమానమా? అయితే ఇలా చేయండి..

మీ గూగుల్ అకౌంట్ (Google Account)ని మీరు కాకుండా వేరే వారు చూస్తున్నారని మీకు అనుమానం వచ్చిందా. ఎవరైనా మీ మీద నిఘా పెట్టినట్టు అనిపించిందా. నిజానికి మనకు ఏ చిన్న సమాధానం సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్ లో సెర్చ్ చేస్తాం.

అన్ని రకాల అకౌంట్లు జి-మెయిల్ కి యాడ్ చేస్తాం. మనం ఎంతగా టెక్నాలజీ(Technology) మీద ఆధారపడిపోయామో అంతగా సైబర్ దాడులు(Cyber Crimes) కూడా పెరిగిపోయాయి. కాస్త అజాగ్రత్తగా ఉంటే చాలు వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్, ఆర్థిక, వ్యాపార విషయాలు సైబర్ నేరగాళ్ళ చేతిలోకి వెళుపోతున్నాయి. ఏ రకంగా అయినా మన అకౌంట్ వివరాలు సైబర్ నేరగాళ్లకు చేరితే వాళ్ళు మన జీవితాల్లోకి సులభంగా తొంగి చూసేయగలరు.

అలాంటి ఇబ్బందులు రాకుండా Google అనేక సెక్యూరిటీ ఫీచర్లను (Google Security ) అందుబాటులోకి తీసుకువచ్చింది. వాటిని ఉపయోగించి మన Google Accounts  ని సేఫ్ గా ఉంచుకోవచ్చు. అది ఎలా అంటే

* ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని సెట్టింగ్ ఆప్షన్‌లోకి వెళ్లండి. క్రిందికి స్క్రోల్ చేసి, “Google” పై క్లిక్ చేయండి.

* ఆ తర్వాత మరో కొత్త విండో ఓపెన్ అవుతుంది. “Mangage Your Google Account ” పై క్లిక్ చేయండి.

* మీరు పైన “Security” అని కనిపించేవరకు కుడివైపుకి స్వైప్ చేయండి.

* “Your Devices” ఆప్షన్ కనిపించేంత వరకు కిందకి స్క్రోల్ చేయండి.

* తరువాత “Manage All Devices” ఆప్షన్‌పై క్లిక్ చేసి, అసలు మీ Google అకౌంట్ ఏయే డివైజ్‌లో లాగిన్ అయ్యిందో చూసుకోండి.

* వాటిలో మీరు ఏ డివైజ్‌లో Google లాగిన్ అయ్యారు.. ఎందులో అవ్వలేదో చెక్ చేసుకోండి.

* మీరు వాడని, అనుమానాస్పద డివైజ్ ఏదైనా కనిపిస్తుంటే, వెంటనే దానిపై క్లిక్ చేసి “Sign Out” అవ్వండి.

సైన్ అవుట్ అయితే చేశారు కానీ మరోసారి ఇబ్బంది రాకుండా ఉండేందుకు సెట్టింగ్స్ ఆప్షన్స్‌లోకి వెళ్లి మీ అకౌంట్ పాస్‌వర్డ్‌ను మార్చేయండి. అనంతరం అదనపు భద్రత కోసం టూ స్టెప్ వెరిఫికేషన్‌ను మొదలు పెట్టండి. ఇదంతా కూడా సెక్యూరిటీ ఆప్షన్స్‌లో ఉంటుంది.

Thanks for reading Google Accounts : Do you suspect that your Google Accounts are being viewed by someone other than you? But do this

No comments:

Post a Comment