Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, July 21, 2023

Post Office Schemes


 Post Office Schemes: పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడితో అధిక వడ్డీ. అత్యంత ప్రజాదరణ పొందిన పథకాలివే..!

గత రెండేళ్ల నుంచి ఆర్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా అన్ని బ్యాంకులు పెట్టుబడులపై వడ్డీ రేట్లను గణనీయంగా పెంచాయి. దీంతో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్‌ పోస్ట్స్‌ కూడా పెట్టుబడిపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తుంది.

భారత ప్రభుత్వం పోస్టాఫీసు డిపాజిట్ పథకాలకు కాలానుగుణంగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది. కచ్చితంగా ఇండియా పోస్ట్ అందించే ఈ పెట్టుబడి ప్రణాళికలు హామీతో కూడిన రాబడితో వస్తాయి. అలాగే ఎలాంటి రిస్క్ లేకుండా ఉంటాయి. పోస్టాఫీసు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు 6.80 శాతం నుంచి 7.50 శాతం వరకూ ఉంటాయి. అలాగే పెట్టుబడిపై స్థిరమైన వృద్ధిని అందిస్తాయి. నేషనల్ సేవింగ్స్ ఇన్‌స్టిట్యూట్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం, ఇండియా పోస్ట్ అందించే ఈ పథకాలను నిర్వహిస్తుంది. కాబట్టివ పెట్టుబడి నమ్మకమైన రాబడి కోసం పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. పోస్టాఫీసలులో అందుబాటులో ఉన్న వివిధ పథకాల గురించి ఓ సారి తెలుసుకుందాం.

పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా

ఈ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా సంవత్సరానికి 4 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అయితే దీని ద్వారా వచ్చే వడ్డీ పూర్తిగా పన్ను విధించదగినదని గుర్తుంచుకోండి, అలాగే టీడీఎస్‌ క్లెయిన్‌ చేసుకునే అవకాశం కూడా ఉండదు.

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఖాతా

ఐదు సంవత్సరాల స్థిర వ్యవధితో మీరు రూ. 100 నుంచి నెలవారీ డిపాజిట్లు చేయవచ్చు. అలాగే ఈ పథకంలో వడ్డీని త్రైమాసికానికి కలిపి 6.5 శాతం చొప్పున వడ్డీని పొందవచ్చు.

టైమ్ డిపాజిట్ ఖాతా

ఇది బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ మాదిరిగానే ఉంటుంది, 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు కాలపరిమితి ఉంటుంది. వడ్డీ త్రైమాసికంలో లెక్కించి, ప్రతి ఏటా చెల్లిస్తారు. ప్రస్తుతం ఒక సంవత్సరం ఖాతాకు 6.9 శాతం, రెండు, మూడు సంవత్సరాల ఖాతాలకు 7 శాతం, ఐదేళ్ల ఖాతాకు 7.5 శాతం వడ్డీ రేట్లు ఉన్నాయి.

మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్

వడ్డీ చెల్లింపుల ద్వారా సాధారణ నెలవారీ ఆదాయాన్ని అందించే తక్కువ-రిస్క్ పెట్టుబడి పథకం. ప్రస్తుత వడ్డీ రేటు 7.40 శాతంగా ఉంది. అలాగే ఈ పథకానికి ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంది.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్

ఈ పథకం ప్రభుత్వ-ఆధారిత పదవీ విరమణ పథకం. ఏకమొత్తం డిపాజిట్లను అనుమతిస్తుంది. ప్రస్తుతం ఈ పథకంలో 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తున్నారు. అలాగే వడ్డీ కూడా త్రైమాసికానికి చెల్లిస్తారు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా

చాలా మంది జీతభత్యాల కోసం ఒక ప్రముఖ పెట్టుబడి, పదవీ విరమణ సాధనం. పీపీఎఫ్‌ సెక్షన్ 8సీC కింద ఆర్థిక సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపులను అందిస్తుంది. వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. అలాగే వడ్డీ కూడా పన్ను రహితంగా ఉంటుంది.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు

ఐదు సంవత్సరాల కాలవ్యవధితో ఎన్‌ఎస్‌సీ 7.7 శాతం వడ్డీ రేటును అందిస్తుంది, వార్షికంగా కలిపి మెచ్యూరిటీ సమయంలో వడ్డీని చెల్లిస్తారు.

కిసాన్ వికాస్ పత్ర

కేవీపీలో పెట్టుబడి పెట్టడం వల్ల 123 నెలల్లో మీ మొత్తం రెట్టింపు అవుతుంది. ప్రస్తుత వడ్డీ రేటు సంవత్సరానికి 7 శాతంగా ఉంది.

సుకన్య సమృద్ధి ఖాతాలు

పది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికల కోసం రూపొందించారు. ఎస్‌ఎస్‌ఏ 8 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. వడ్డీ వార్షికంగా లెక్కిస్తారని గుర్తుంచుకోవాలి.

Thanks for reading Post Office Schemes

No comments:

Post a Comment