Home Loan: సొంతింటి కలను నిజం చేసే హోమ్ లోన్.. పూర్తి ప్రయోజనాలు ఇలా పొందండి
ఇండియాలో చాలా మందికి సొంతింటి కల ఉంటుంది. స్థలం కొని కట్టుకోవడమో.. కట్టిన ఇంటిని కొనుక్కోవడమో.. ఏదో ఒక మార్గంలో ఈ ఇల్లు నా సొంతం అనుకోవాలని ఆశ పడుతుంటారు.
సంపాదన మొదలైనప్పటి నుంచి ఎంతో కొంత ఇంటి కోసం దాస్తూ వస్తుంటారు. అయితే ప్రస్తుత ఆర్థిక అనిశ్చితులు, ద్రవ్యోల్బణం కారణంగా మార్కెట్ ధరలు విపరీతంగా పెరిగాయి.
చాలా మందికి సొంతింటి కల నెరవేర్చుకోవడం సవాలుగా మారింది. అయితే ఈ సమయంలో హోమ్ లోన్ మంచి పరిష్కారంగా కనిపిస్తోంది. చాలా రకాల ఫీచర్లతో నేషనల్, ప్రైవేట్ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌లు అందిస్తున్న హోమ్ లోన్‌లు ఆకర్షణీయంగా ఉన్నాయి. సొంతింటి కల ఆశలను సజీవంగా ఉంచుతున్నాయి.
హోమ్ లోన్లు సాధారణంగా ఎక్స్‌టెండెడ్ టెన్యూర్‌లతో వస్తాయి. కొన్నిసార్లు 30 సంవత్సరాల వరకు ఉంటాయి. రీపేమెంట్‌కి ఎక్కువ కాలం లభించినట్లు అనిపించినా, రుణగ్రహీతలు సరైన లోన్‌ను ఎంచుకోవడం ద్వారా తమ ఆర్థిక వ్యవహారాలను మేనేజ్ చేసుకోవచ్చు. ద్రవ్యోల్బణం వడ్డీ రేట్లను ప్రభావితం చేస్తుంది. ఇది హోమ్ లోన్ ఓవరాల్ కాస్ట్‌ను నిర్ణయించడంలో కీలకంగా మారుతుంది. సముచితమైన లోన్ ఎంచుకుంటే రుణగ్రహీతలు తక్కువ వడ్డీ రేట్లను పొందవచ్చు.
* హోమ్ లోన్ రకాలు :ప్రస్తుతం వివిధ రకాల హోమ్ లోన్స్ అందుబాటులో ఉన్నాయి. అవి హోమ్ పర్చేస్ లోన్స్, హోమ్ కన్‌స్ట్రక్షన్ లోన్స్. అంతే కాకుండా ల్యాండ్ పర్చేస్, హోమ్ ఎక్స్‌టెన్షన్, హోమ్ ఇంప్రూవ్‌మెంట్, హోమ్ కన్వర్షన్ లోన్‌లను కూడా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి.
* బ్యాంకును బట్టి వడ్డీ :ప్రతి లోన్‌కి వడ్డీ రేట్లు బ్యాంకును బట్టి మారవచ్చు. బ్యాంకులు సులభంగా లోన్ మంజూరు చేస్తాయి, కానీ రుణగ్రహీతలు తమ ఆర్థిక స్థితికి వడ్డీ రేట్లు సరిపోతాయో? లేదో? చెక్ చేసుకోవాలి. అన్ని రకాల బ్యాంకుల్లో వడ్డీలను పోల్చి చూడాలి. బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్‌బిఐ, సిటీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి కొన్ని ప్రముఖ బ్యాంకులు హోమ్ లోన్స్ అందిస్తున్నాయి.
ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 30 సంవత్సరాల టెన్యూర్‌కి సంవత్సరానికి 8.50% వడ్డీ రేటుతో ప్రాపర్టీ కాస్ట్‌లో 90% వరకు హోమ్ లోన్స్ అందిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ శాఖ సిబ్బంది, కొండలు లేదా గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న దరఖాస్తుదారుల కోసం బ్యాంక్ ప్రత్యేక హోమ్ లోన్ ఆప్షన్లు ఆఫర్ చేస్తోంది.
HDFC బ్యాంక్ దాదాపు 30 సంవత్సరాల పాటు సంవత్సరానికి 8.40% వడ్డీ రేటుతో ప్రారంభమయ్యే హోమ్ లోన్ ఇస్తుంది. దాదాపు రూ.10 కోట్ల వరకు లోన్ పొందే అవకాశం ఉంది. ICICI బ్యాంక్, 30 సంవత్సరాల వరకు సంవత్సరానికి 9.00% వడ్డీ రేటుతో లోన్ ఇస్తోంది. రూ.10 కోట్లు వరకు హోమ్ లోన్ పొందవచ్చు.
* సెకండ్ హోమ్ లోన్ ఇస్తారా? :హోమ్ లోన్‌లోల పెద్ద మొత్తంలో అమౌట్ తిరిగి చెల్లించాలి కాబట్టి చాలా మంది, సింగిల్ హోమ్ లోన్‌కి పరిమితం అవుతారు. అయితే కొన్ని సందర్భాల్లో, వ్యక్తులు రెండో హోమ్ లోన్‌ని కూడా పరిగణించవచ్చు. రెండో హోమ్ లోన్ క్రెడిట్ స్కోర్, ఇన్‌కమ్ సోర్స్, లోన్ రీపేమెంట్ కెపాసిటీ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
లోన్ తీసుకునే ముందు సలహాదారులు లేదా ఆర్థిక మార్గదర్శకుల నుంచి సలహా తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది. దరఖాస్తుదారులు హోమ్ లోన్ ప్రాసెస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు సమీపంలోని బ్యాంకును కూడా సందర్శించవచ్చు.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య సొంతి కలను నెరవేర్చుకునే మార్గంగా హోమ్ లోన్ కనిపిస్తోంది. వివిధ లోన్ ఆప్షన్‌లను జాగ్రత్తగా పరిశీలించి, వడ్డీ రేట్లను సక్రమంగా పోల్చుకుని, రుణగ్రహీతలు తమ ఇంటి యజమాని కలలను సాకారం చేసుకోవచ్చు.
Thanks for reading Home Loan: A home loan that makes the dream of owning a home... Get full benefits like this
No comments:
Post a Comment