SBI Yono UPI: ఎస్‌బీఐ యోనోలో అదిరిపోయే అప్‌డేట్.. ఎస్‌బీఐ ఖాతాలేకపోయినా సింపుల్‌గా మనీ ట్రాన్స్‌ఫర్..
భారతదేశంలో నోట్ల రద్దు తర్వాత బ్యాంకింగ్ రంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఎన్‌పీసీఐ ద్వారా తీసుకొచ్చిన యూపీఐ పేమెంట్స్ కారణంగా ఖాతాదారులు చాలా సింపుల్‌గా డిజిటల్ చెల్లింపు చేస్తున్నారు.
అలాగే యూపీఐ చెల్లింపులను సపోర్ట్ చేస్తూ వచ్చి చాలా యాప్స్ ప్రజాదరణ పొందాయి. అలాగే ఎస్‌బీఐ కూడా తన బ్యాంకింగ్ అవసరాల కోసం యోనో యాప్‌ను తీసుకువచ్చింది. అయితే ఇప్పటివరకూ యోనో నుంచి చెల్లింపులు చేయాలంటే కేవలం ఎస్‌బీఐ ఖాతాదారులకు మాత్రమే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం నాన్ ఎస్‌బీఐ ఖాతాదారులు కూడా యోనోను ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. ఇది ఎస్‌బీఐయేతర కస్టమర్‌లు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) మోడ్‌ని ఉపయోగించి డిజిటల్ చెల్లింపులు చేయడానికి యోనో అప్లికేషన్‌ను అప్‌డేట్ చేసింది. ఇకపై, వినియోగదారులు ఏదైనా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి చెల్లింపులు చేయవచ్చు. అలాగే, వినియోగదారులు వారి పరిచయాలకు డబ్బు పంపవచ్చు. ఖాతాల మధ్య నిధులను బదిలీ చేయవచ్చు, ఫోన్ నంబర్‌లకు డబ్బు పంపవచ్చు. ఇతరుల నుంచి డబ్బును అభ్యర్థించవచ్చు. కాబట్టి ప్రస్తుతం ఎస్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా ఎస్‌బీఐ తన యూజర్ బేస్ పెంచుకుంటుందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా యోనో యాప్ మొత్తం డౌన్‌లోడ్‌ల సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి తాజాగా నాన్ ఎస్‌బీఐ ఖాతాదారులు ఎస్‌బీఐ యోనో యాప్‌ను ఎలా వాడాలో? ఓ సారి తెలుసుకుందాం.
ఎస్‌బీఐ యోనో వాడకం ఇలా
స్టెప్-1: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎస్‌బీఐ యోనో అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయాలి.
స్టెప్-2: రిజిస్ట్రేషన్‌ను కొనసాగించడానికి ‘న్యూ టు ఎస్‌బీఐI’పై క్లిక్ చేయాలి.
స్టెప్-3: మొబైల్ నంబర్‌ని నమోదు చేసి దానిని బ్యాంక్ ఖాతాకు లింక్ చేయాలి.
స్టెప్-4: ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేసి, ఆపై యూపీఐ ఐడీని సృష్టించండి.
స్టెప్-5: అనంతరం బ్యాంకును ఎంచుకోవాలి.
స్టెప్-6: ఎస్‌బీఐ పేపై రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి, ఆపై ధ్రువీకరణ ప్రక్రియను కొనసాగించాలి.
స్టెప్-7: యూపీఐ ఐడీని సృష్టించిన తర్వాత వినియోగదారులు యూపీఐని వారి ప్రాధాన్య చెల్లింపు మోడ్‌గా ఎంచుకోవాలి.
స్టెప్-8: ఆపై మీ ఖాతాకు లాగిన్ చేసి ఎం పిన్‌ని సెట్ చేయాలి.
స్టెప్-9: ఎం పిన్‌ను సెట్ చేసిన తర్వాత మీరు యూపీఐ చెల్లింపులు చేయడానికి ఎస్‌బీఐ యోనోను ఉపయోగించవచ్చు.
Thanks for reading SBI Yono UPI: Amazing update in SBI Yono.. Simple money transfer even without SBI account...
No comments:
Post a Comment