SAIL Recruitment 2023 – Apply for 375 Apprentice Posts
SAIL Recruitment: కేంద్ర ప్రభుత్వ సంస్థలో అప్రెంటిస్ పోస్టులు.. అర్హులెవరంటే.
ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 375 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం 375 పోస్టుల్లో ట్రేడ్ అప్రెంటిస్ (188), టెక్నీషియన్ అప్రెంటిస్ (136), గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (51) ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఐటీఐ లేదా డిప్లొమా లేదా సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి.
ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే క్యాండిడేట్స్ వయసు 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. నియమ నిబంధనల ఆధారంగా సడలింపులు ఉంటాయి.
దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 17-07-2023 తేదీన ప్రారంభమవుతుంది. చివరి తేదీగా 04-08-2023ని నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://sail.co.in/en/home ను సందర్శించండి.
ఈ నోటిఫికేషన్ ద్వారా రూర్కెలా ఉన్న స్టీల్ ప్లాంట్‌లోని గ్రాడ్యుయేట్/టెక్నీషియన్/ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
Thanks for reading SAIL Recruitment 2023 – Apply for 375 Apprentice Posts
No comments:
Post a Comment