PhonePe కొత్త సదుపాయం.. నెలవారీ చెల్లింపులతో హెల్త్ ఇన్సురెన్స్
నెలవారీ చెల్లింపులతో ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేసే సదుపాయాన్ని ఫోన్‌పే తీసుకొచ్చింది.
వాల్‌మార్ట్‌కు చెందిన ప్రమఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే (PhonePe) అనుబంధ సంస్థ ఫోన్‌పే ఇన్సురెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ హెల్త్ ఇన్సురెన్స్ విభాగంలోకి అడుగుపెట్టింది. వినియోగదారులు తాము ఎంచుకున్న ఆరోగ్య బీమా పాలసీకి నెలవారీ చెల్లింపులు చేసే వెసులుబాటును తీసుకొచ్చింది. ఒకేసారి పెద్ద మొత్తంలో చెల్లింపులు చేయలేనివారి కోసం ఈ సదుపాయాన్ని తీసుకొచ్చినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం ప్రముఖ ఇన్సురెన్స్ సంస్థలతో ఫోన్‌పే జట్టుకట్టింది. యూపీఐ ద్వారా నెలవారీ చెల్లింపులు చేసుకునే వెసులుబాటు తీసుకొచ్చింది.
దేశంలో ఇప్పటికే బ్యాంకులు, కొన్ని ఇన్సురెన్స్ సంస్థలు ఆరోగ్య బీమా పాలసీలు అందిస్తున్నాయి. వాటికి ఒకేసారి చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. పెద్ద మొత్తంలో చెల్లించలేని వారి కోసం నెలవారీ చెల్లింపుల సదుపాయాన్ని తీసుకొచ్చినట్లు ఫోన్‌పే ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్ గాలా తెలిపారు. దీనివల్ల వినియోగదారులపై పెద్దగా భారం ఉండబోదని చెప్పారు. కావాలంటే ఒకేసారి చెల్లింపులు చేసుకునే సదుపాయమూ ఉందన్నారు.
తమ ప్లాట్‌ఫాం ద్వారా కోటి రూపాయల విలువైన హెల్త్ ఇన్సురెన్స్‌ను కవరేజీని పొందొచ్చని ఫోన్‌పే తెలిపింది. అలాగే ఎలాంటి పరిమితులు లేకుండా ఆస్పత్రి రూమ్‌ను ఎంచుకోవచ్చని పేర్కొంది. హెల్త్ ఇన్సురెన్స్‌ను వినియోగించుకోని సంవత్సరాలకు గానూ బేస్ కవర్ అమౌంట్‌పై 7 రెట్ల వరకు బోనస్ కవర్‌ను పొందొచ్చని ఫోన్‌పే తెలిపింది. ప్రాథమిక సమాచారం అందివ్వడం ద్వారా సులువుగా ఇన్సురెన్స్‌ను పొందొచ్చని కంపెనీ తెలిపింది.
Thanks for reading PhonePe: Health insurance with Monthly subcription
No comments:
Post a Comment