Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, July 10, 2023

Reliance Jio: Want Jio number of your choice..


 Reliance Jio: మీకు నచ్చిన జియో నంబర్ కావాలా.. ఇలా ఎంచుకోండి

Reliance Jio: నచ్చిన అంకెలతో కొత్త జియో సిమ్‌ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఎలాగో తెలుసుకోండి. 

కొత్త సిమ్‌ కార్డు తీసుకోవాలంటే టెలికాం ఆపరేటర్‌ వద్ద ఉన్న వాటిలో ఏదో ఒక నంబర్‌ను ఎంచుకోవాలి. ఆ నంబర్‌ నచ్చకపోయినా అలాగే వినియోగించాలి. కానీ, చాలా మంది తమకు ఇష్టమైన అంకెలు, పుట్టిన తేదీ, లక్కీ నంబర్లు ఇలా.. ఈ అంకెలు ఫోన్‌ నంబర్‌లో ఉండాలనుకుంటారు. కానీ అది వీలు పడదు. దీని కోసం జియో (Reliance Jio) కొత్త స్కీమ్‌ తీసుకొచ్చింది. తమకు నచ్చిన అంకెలతో ఫోన్‌ నంబర్‌ ఎంచుకొనే వెసులుబాటు జియో యూజర్లకు అందించింది. 

‘ఛాయిస్‌ నంబర్‌’ (Choice Number) స్కీమ్‌ పేరుతో జియో తమ కస్టమర్లకు నచ్చిన నంబర్‌తో సిమ్ కార్డును కొనుగోలు చేసే సౌకర్యాన్ని కల్పించింది. ఈ స్కీమ్‌లో భాగంగా కొత్తగా జియో సిమ్‌ను కొనుగోలు చేయాలనుకొనే వారు ఫోన్‌నంబర్‌ చివరి నాలుగు నుంచి ఐదు అంకెలు ఎంచుకొనే స్వేచ్ఛను కల్పించింది. దీంతో జియో వినియోగదారులు తమకు నచ్చిన నంబర్‌ వచ్చేలా సిమ్‌కార్డ్‌ను తీసుకోవచ్చు. ఇంతకు ముందు వొడాఫోన్ ఐడియా (Vodafone Idea), బీఎస్‌ఎన్‌ఎల్‌  (BSNL) మాత్రమే ఇటువంటి సౌకర్యాన్ని అందించేవి. కొత్తగా రిలయన్స్ జియో కూడా ఈ జాబితాలో చేరింది. అయితే మీకు నచ్చిన నంబర్‌ను ఎలా ఎంచుకోవాలో చూద్దాం..

 Jio.com లోకి వెళ్లి ‘సెల్ఫ్‌ కేర్’ సెక్షన్‌ను ఎంచుకోవాలి. 

 అందులో ‘Choice number’ సెక్షన్‌ను వెళ్లాలి. 

 అందులో మీరు వినియోగిస్తున్న జియో నంబర్‌ను ఎంటర్‌ చేయగానే మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది.

 ఓటీపీని ఎంటర్‌ చేయగానే మీ పిన్‌కోడ్‌, మీ పేరు చూపుతుంది. అందులో మీకు నచ్చిన నాలుగు లేదా ఐదు అంకెలను ఎంటర్ చేసి ‘Show avilable numbers’ పై క్లిక్‌ చేయాలి.

 మీరు ఎంచుకున్న నంబర్‌కు మీ పిన్‌ కోడ్‌ ఆధారంగా కొన్ని ఫోన్ నంబర్లను చూపుతుంది. 

 అందులో మీకు నచ్చిన నంబర్‌ను ఎంచుకొని ‘proceed’పై  క్లిక్‌ చేయాలి.

 ఆ తర్వాత స్క్రీన్‌ పై ఉన్న ‘Pay now’ ఆప్షన్ పై క్లిక్‌ చేసి డబ్బులు చెల్లించాలి. డబ్బులు చెల్లించిన 15 రోజుల్లోగా మీకు నచ్చిన అంకెలతో సిమ్‌ కార్డ్‌ యాక్టీవ్ అవుతుంది.

 ఈ (https://www.jio.com/selfcare/choice-number/) లింక్‌ క్లిక్‌ చేయటం ద్వారా సంబంధిత వెబ్‌పేజ్‌కు వెళ్తారు. లేదా మీ మొబైల్‌ ఫోన్‌లోని MyJio app  యాప్‌ ద్వారా కూడా పైనున్న విధంగా నచ్చిన నంబర్‌ను ఎంచుకోవచ్చు.

Thanks for reading Reliance Jio: Want Jio number of your choice..

No comments:

Post a Comment