SBI YONO: గూగుల్ పే, ఫోన్‌పేలకు ఎస్‌బీఐ భారీ షాక్.. బ్యాంక్ కస్టమర్లకు కొత్త సర్వీసులు!
UPI | దేశీ ప్రముఖ బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా గూగుల్ పే (Google Pay), ఫోన్‌పే (PhonePe), పేటీఎం వంటి వాటికి భారీ షాకిచ్చింది.
ఇక అన్ని బ్యాంకుల కస్టమర్లకు సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని వల్ల చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఎస్‌బీఐ తన యోనో ప్లాట్‌ఫామ్ ద్వారా యూపీఐ సర్వీసులను అన్ని బ్యాంకుల కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. దీని వల్ల ఏ బ్యాంక్ కస్టమర్ అయినా ఎస్‌బీఐ యోన్ ద్వారా యూపీఐ సేవలు పొందొచ్చు.
ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా యూపీఐ సర్వీసులు పొందాలంటే మీరు కచ్చితంగా ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాల్సిన పని లేదు. మీకు ఏ బ్యాంక్‌లో అకౌంట్ ఉన్నా కూడా ఈ సేవలు పొందొచ్చు. స్కాన్ అండ్ పే, పే బై కాంటాక్ట్స్, రిక్వెస్ట మనీ వంటి తదితర సర్వీసులను యోనో యాప్ ద్వారా పొందొచ్చని, అన్ బ్యాంకుల కస్టమర్లకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని ఎస్‌బీఐ పేర్కొంటోంది.
స్టేట్ బ్యాంక్‌లో అకౌంట్ లేని వారు ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా ఇతరులకు ఎలా డబ్బులు పంపొచ్చొ మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ముందుగా మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యోనో యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలా. తర్వాత న్యూ టు ఎస్‌బీఐ అనే ఆప్షన్ ఉంటుంది. దీని కింద రిజిస్టర్ నౌ ఆప్షన్ కనిపిస్తుంది. ఎస్‌బీఐలో అకౌంట్ లేని వారు ఈ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాతి పేజ్‌లో రిజిస్టర్ టు మేక్ యూపీఐ పేమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
అయితే ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి. మీ బ్యాంక్ అకౌంట్‌తో కచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి. మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకోవాలి. తర్వాత యూపీఐ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. మీ బ్యాంక్ ఎంచుకోవాలి. ఇప్పుడు మీకు ఎస్‌బీఐ పే మెసేజ్ వస్తుంది. తర్వాత మీరు ఎస్‌బీఐ యూపీఐ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. ఎస్‌బీఐ మీకు మూడు యూపీఐ ఐడీలను సూచిస్తుంది. మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు. తర్వాత మీ ఎస్‌బీఐ యూపీఐ ఐడీ క్రియేట్ అయిపోతుంది. ఎంపిన్ సెట్ చేసుకోవాలి. తర్వాత మీరు యూపీఐ ద్వారా చెల్లింపులు చేయొచ్చు. దీని వల్ల ఇక గూగుల్ పే, ఫోన్‌పే వంటి వాటితో అవసరం ఉండదు. ఏ బ్యాంక్ కస్టమర్ అయినా యూపీఐ ద్వారా పేమెంట్లు నిర్వహించొచ్చు. మనీ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.
Thanks for reading SBI YONO: SBI is a big shock to Google Pay and PhonePay.. New services for bank customers!
No comments:
Post a Comment