సైలెంట్ లో పెట్టిన ఫోన్ కనిపించకపోతే ఎలా గుర్తించాలంటే..
Did you switch off your phone ringer and misplace the phone? Since its on silent, even calling it from another number might not help. The simple way out is to head to www.google.com/android/devicemanager and login with the same Google ID as the phone.
Here, you can view the location of your phone and send a signal to ring loudly -even with the ringer off.
మనం ఇంట్లో అప్పుడప్పుడు ఫోన్( Mobile Phone ) ఎక్కడ పెట్టామో తెలియక ఇల్లంతా వెతికేస్తూ ఉంటాం. ఇలా చాలాసార్లు చాలామంది తమ ఇళ్లల్లో ఫోన్ ఎక్కడ పెట్టామో మర్చిపోయి వెతికిన సందర్భాలు కచ్చితంగా ఉంటాయి.
ఆ ఫోన్ కనిపించేంతవరకు ఇల్లు పీకి పందిరి వేస్తాం. లేదంటే ఇంట్లో ఉండే వేరే ఫోన్ తో ఆ ఫోన్ కి కాల్ చేసి ఎక్కడ ఉందో తెలుసుకుంటాం. ఒకవేళ సైలెంట్ లో( Silent Mode ) పెట్టిన సెల్ ఫోన్ ఎక్కడ పెట్టామో మర్చిపోతే.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆ ఫోన్ గుర్తించడం కష్టమని అందరికీ తెలిసిందే.
అయితే సైలెంట్ లో ఉన్న ఫోను కూడా క్షణాల్లో గుర్తించే టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఈ టెక్నాలజీ గురించి కొంతమందికి తెలిసే ఉంటుంది. చాలామందికి తెలియదు. సైలెంట్ లో ఉన్న ఫోన్ ను ఎలా గుర్తించాలో చూద్దాం.అయితే ఇంట్లో wifi లేదా 3G డేటా ఉపయోగించే ఫోన్ ఇంటర్నెట్ కి కనెక్ట్ చేయగలిగితే ఫోన్ ఎక్కడ ఉందో ఈజీగా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఇంటర్నెట్ అనేది ఉంటుంది కాబట్టి సైలెంట్ లో ఉన్న ఫోన్ ను పెట్టే అవకాశం ఉంది.
గూగుల్ ఓపెన్ చేసి ఫైండ్ మై ఫోన్( Find My Phone ) అని టైప్ చేసి ఎంటర్ బటన్ నొక్కాలి. ఆ తర్వాత అందులో తమ గూగుల్ ఖాతా వివరాలతో లాగిన్ అవ్వాలి. వెంటనే చిన్న మ్యాప్ తో పేజీలో చిన్న ఫ్రేమ్ కనిపిస్తుంది. అది మొబైల్ లొకేషన్ ని ( Mobile Location ) నిర్ధారిస్తుంది. ఆ తర్వాత రిమోట్ గా రింగ్ చేసే అవకాశం కూడా కల్పిస్తుంది. కేవలం రింగ్ బటన్ పై క్లిక్ చేసిన తర్వాత సైలెంట్ లో ఉన్న ఫోన్ నుంచి ఐదు నిమిషాల పాటు ఫుల్ వాల్యూమ్ తో రింగ్ సౌండ్ వినిపిస్తుంది. ఫోన్ దొరికిన తర్వాత ఆ పవర్ బటన్ నొక్కితే రింగ్ అగిపోతుంది. ప్రస్తుతం సైలెంట్ మోడ్ లో ఉన్న ఫోన్ రింగ్ అవ్వడానికి అనేక యాప్లు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ముందుగానే వాటిని డౌన్లోడ్ చేసుకుని సెట్టింగ్స్ లో వాటిని కనెక్ట్ చేసుకుంటే సైలెంట్ లో ఉన్న ఫోన్ ఎక్కడ ఉందో కనిపెట్టవచ్చు.
Thanks for reading How to identify if the phone is not found on silent mode.
No comments:
Post a Comment