Wimbledon: జకోవిచ్‌కు షాక్.. వింబుల్డన్ టైటిల్‌ను ఎగరేసుకుపోయిన అల్కరాస్
స్పెయిన్ యువ కెరటం, ప్రపంచ నంబర్‌వన్ కార్లోస్ అల్కరాస్ అదరగొట్టాడు. ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ 2, సెర్బియా దిగ్గజ ఆటగాడు నొవాక్ జకోవిచ్‌ను మట్టికరిపించాడు.
వింబుల్డన్: స్పెయిన్ యువ కెరటం, ప్రపంచ నంబర్‌వన్ కార్లోస్ అల్కరాస్ కొత్త ఛాంపియన్‌గా అవతరించాడు. ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ 2, సెర్బియా దిగ్గజ ఆటగాడు నొవాక్ జకోవిచ్‌ను మట్టికరిపించాడు. వింబుల్డన్ సెంటర్ కోర్టులో హోరాహోరీగా సాగిన తుదిపోరులో జకోను 1-6, 7-6 (8/6), 6-1, 6-3, 6-4 తేడాతో అల్కరాస్ ఓడించాడు. 20 ఏళ్ల అల్కరాస్ ఫైనల్ చేరిన మొదటిసారే వింబుల్డన్ టైటిల్‌ను గెల్చుకోవడం విశేషం. ఈ విజయంతో ఓవరాల్‌గా 24 టైటిళ్లతో అగ్రస్థానంలో ఉన్న మార్గరెట్‌ను సమం చేస్తానని భావించిన జకోవిచ్ ఆశలు ఫలించలేదు.
డిఫెండింగ్ ఛాంపియన్ అయిన జకోవిచ్ 2018 నుంచి వరుసగా ఈ వేదికపై గెలుస్తూ వస్తున్నాడు. ఇప్పటికే పురుషుల సింగిల్స్‌లో 23 టైటిళ్లు నెగ్గి మరో కప్పుపై కన్నెసిన జకోకు ఈ సారి ఊహించని పోరు ఎదురైంది. తొలి సెట్ నుంచే జకోవిచ్, అల్కరాస్ హోరాహోరీగా తలపడ్డారు. అయితే ఎంతో అనుభవం ఉన్న జకోవిచ్ 6-1 తేడాతో తొలిసెట్‌ను సునాయాసంగా నెగ్గాడు. ఇక రెండో సెట్‌లో పుంజుకున్న అల్కరాస్ తన శక్తినంతా ఉపయోగించి ఆడాడు. దీంతో రెండో సెట్‌లో 7-6(8-6)తేడాతో అల్కరాస్ నెగ్గాడు. ఇక మూడో సెట్‌ను అల్కరాస్ 6-1 సునాయాసంగా గెలుచుకుని షాక్ ఇచ్చాడు. దీంతో నాలుగో సెట్‌పై ఉత్కంఠ పెరిగింది. తిరిగి పుంజుకున్న జకో 6-3 తేడాతో ఈ సెట్‌ను నెగ్గాడు. దీంతో మ్యాచ్ నిర్ణయాత్మక ఐదో సెట్‌కు దారితీసింది. ఇక ఐదో సెట్‌లో ఇరువురు ఆటగాళ్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. తొలుత అల్కరాస్ లీడ్‌లోకి వెళ్లగా అనంతరం జకోవిచ్ మెళ్లిగా అంతరాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు. దీంతో స్కోర్ 5-4కు చేరుకోవడంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. అయితే ఒత్తిడిని చిత్తుచేస్తూ అల్కరాస్ విజయం సాధించాడు. దీంతో ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ వింబుల్డన్ వేదికకు అల్కరాస్ రూపంలో కొత్త ఛాంపియన్ పుట్టుకొచ్చాడు.
Thanks for reading Wimbledon men's final 2023: Carlos Alcaraz beats Novak Djokovic ...
No comments:
Post a Comment