పేరెంట్స్ కమిటీ మీటింగ్ ప్రొసీడింగ్స్ ఆధారంగా, తల్లిదండ్రులతో చర్చించడానికి కొన్ని ముఖ్యమైన పాయింట్లు
1. పరిచయం:
- విద్యారంగంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ కృషి
- పాఠశాల కార్యక్రమాలలో తల్లిదండ్రుల చురుకైన భాగస్వామ్యం అవసరం
2. ప్రభుత్వం ద్వారా ప్రారంభించబడిన ముఖ్య కార్యక్రమాలు:
- *జగనన్న విద్యా కానుక:
విద్యార్థులకు కిట్‌లు అందజేస్తున్నారు
- *అమ్మఒడి కార్యక్రమం: పిల్లల చదువులకు ఆర్థిక సహాయం
- *మన బడి నాడు-నేడు:
పాఠశాల మౌలిక సదుపాయాల మెరుగుదల
- *జగనన్న గోరుముద్ద:
పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనం
- *ఇంటర్నెట్ సౌకర్యం మరియు డిజిటల్ లెర్నింగ్ కార్యక్రమాలు, IFP/ SMART TV ల ద్వారా విద్యా బోధన
3. అమ్మఒడి కార్యక్రమం:
- ఆర్థికంగా వెనుకబడిన తల్లులకు ఆర్థిక సహాయం అందించడం
- నమోదును పెంచడం, డ్రాపౌట్‌లను తగ్గించడం మరియు అక్షరాస్యతను మెరుగుపరచడం లక్ష్యం.
4. మన బడి నాడు-నేడు:
- పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి 11 భాగాలు
- దశ-I మరియు దశ-II అమలు పరచడం జరుగుతుంది.
5. జగనన్న గోరుముద్ద:
- మధ్యాహ్న భోజనం కోసం మెరుగైన మెనూ
- పోషక విలువలు గల మరియు రుచికరమైన భోజనంపై దృష్టి కేంద్రీకరించాము.
6. జగనన్న విద్యా కానుక:
- విద్యార్థులకు, బడికి రావడానికి, ఉపయోగించడానికి అవసరమైన వస్తువులను అందించడం
- ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల గౌరవాన్ని పెంపొందించడం
7. ఆర్థిక సహాయం:
- టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ (TMF) మరియు స్కూల్ మేనేజ్‌మెంట్ ఫండ్ (SMF)
- నిర్వహణ మరియు మరమ్మతులకు సహకరించడంలో తల్లిదండ్రుల పాత్ర.
8. పాఠ్యాంశాలు మరియు అభ్యాసం:
- మెరుగైన అభ్యాస ఫలితాల కోసం ప్రమోషన్స్ ద్వారా సబ్జెక్ట్ ఉపాధ్యాయులు కేటాయింపు.
- CBSE మరియు కరిక్యులర్ సంస్కరణలకు శ్రీకారం.
- FA-1 పరీక్ష ఫలితాల విశ్లేషణ.
9. టీచర్ కెపాసిటీ బిల్డింగ్:( ట్రైనింగ్ లు ):
- CBSE సిలబస్ పరిచయం కోసం శిక్షణ కార్యక్రమాలు
- CBSE-నమూనా పబ్లిక్ పరీక్షలకు పిల్లలు కూడా సిద్ధమవుతున్నారు
10. బాలికల సాధికారత:
- ప్రతి మండలంలో బాలికల జూనియర్ కళాశాలల ఏర్పాటు
11. డిజిటల్ లెర్నింగ్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్:
- 8వ తరగతి విద్యార్థులకు tabs పంపిణీ. ప్రతీ విద్యార్థికి ఒక tab.
- ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (IFPలు) మరియు స్మార్ట్ టీవీల ఇన్‌స్టాలేషన్. వాటి ద్వారా విద్యాబోధన.
12. పాఠశాల ల్లో చేర్పించుటకు స్పెషల్ డ్రైవ్:
- పిల్లలను తిరిగి పాఠశాలకు తీసుకురావడానికి ప్రయత్నాలు
- వెనుకబడిన పిల్లలకు ప్రత్యేక బోధన
మీటింగ్ లో HM చేయవలసినవి :
మీటింగ్ ప్రాముఖ్యత వివరించడం.
అవసరమైన వీడియోస్ ప్లే చెయ్యడం.
ముఖ్యమంత్రి సందేశాన్ని టీవీ ద్వారా వినిపించడం.
తల్లితండ్రులు మాట్లాడిన విషయాలు , కొన్ని నిమిషాలు రికార్డ్ చెయ్యడం, ముఖ్యమైన విషయాలను రికార్డ్ చెయ్యడం. MRC కి పంపడం.
Thanks for reading Based on the proceedings of the parents committee meeting, some important points to discuss with the parents are
No comments:
Post a Comment