Gmail storage: జీమెయిల్ స్టోరేజీ ఫుల్ అని చూపిస్తోందా? ఇలా క్లీనప్ చేసుకోండి..
Gmail Storage full: జీమెయిల్ వాడుతున్న చాలా మంది స్టోరేజీ సమస్య ఎదుర్కొంటూ ఉంటారు. ఒకవేళ మీకూ ఆ పరిస్థితి ఎదురైతే స్పేస్‌ను ఎలా క్లీనప్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ఫోన్లు, కంప్యూటర్లు వాడేవారందరికీ గూగుల్ డ్రైవ్, జీమెయిల్, గూగుల్ ఫొటోస్ వంటి గూగుల్ సర్వీసులు సుపరిచితమే. సాధారణంగా ఏళ్లుగా వాడుతున్న వారికి గూగుల్ ఉచితంగా అందించే 15GB క్లౌడ్ స్టోరేజీ దాదాపు పూర్తయిపోయి ఉంటుంది. ఒకవేళ స్టోరేజీ పూర్తయితే గూగుల్ వన్ అకౌంట్ తీసుకుని నెలకు రూ.130 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు 100 జీబీ స్పేస్ లభిస్తుంది. కానీ ఇవి చేస్తే ఎలాంటి డబ్బులూ చెల్లించకుండానే మీ జీమెయిల్ ఖాతాపై ఉన్న ఉచిత స్టోరేజీని క్లీనప్ చేసుకోవచ్చు.

గూగుల్ స్టోరేజీని క్లీనప్ చేయడానికి గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోస్, జీమెయిల్ వంటి వివిధ సర్వీసుల్లో ఉన్న అనవసర డేటాను తొలగించాల్సి ఉంటుంది. ఇందుకోసం కొన్ని ఫైల్స్ డిలీట్ చేయాల్సి ఉంటుంది. ఈ పని త్వరగా, సులువుగా పూర్తవ్వాలంటే మొబైల్ కంటే కూడా డెస్క్‌టాప్/ ల్యాప్‌టాప్ వినియోగించడం మంచిది. ఇందుకోసం ముందుగా గూగుల్ వన్ స్టోరేజీ మేనేజర్‌కి వెళితే దేనికంత స్టోరేజీ అవుతోందో చూపిస్తుంది. ఏయే సర్వీసుల్లో పెద్ద పెద్ద ఫైల్స్ ఉన్నాయో రివ్యూ చేయొచ్చు. ఆయా సర్వీసులపై క్లిక్ చేస్తే డిలీట్ చేయదగ్గ పెద్ద సైజు ఫైల్స్ దర్శనమిస్తాయి. వాటిని సులువుగా డిలీట్ చేయొచ్చు.
అన్‌రీడ్ మెయిల్స్‌పై లుక్కేయండి: మనం నిత్యం ఎన్నో వెబ్‌సైట్లను సందర్శిస్తుంటాం. అవి ఎప్పటికప్పుడు ప్రమోషనల్ మెయిల్స్ పంపిస్తూనే ఉంటాయి. దీంతో మన జీమెయిల్ ఇన్‌బాక్స్ నిండిపోతూ ఉంటుంది. ఈ తరహా మెయిల్స్‌ను తొలగించడం ద్వారా స్పేస్‌ను క్రియేట్ చేయొచ్చు. ఇందుకోసం జీమెయిల్ ఇన్‌బాక్స్‌లో చెక్‌బాక్స్ పక్కనే ఉన్న డ్రాప్‌డౌన్ మెనూపై క్లిక్ చేయండి. అక్కడ అన్‌రీడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత చెక్‌బాక్స్‌పై క్లిక్ చేసి డిలీట్ బటన్ క్లిక్ చేస్తే అన్‌రీడ్ మెయిల్స్‌ను డిలీట్‌చేయొచ్చు.
పాత మెయిల్స్ తొలగించండి: స్టోరేజీని క్లీన్ చేయడంలో భాగంగా పాత ఇ-మెయిల్‌ను తొలగించడం అన్నింటికంటే ఉత్తమమైన మార్గం. ముందుగా మీకు ఏయే మెయిల్స్ వద్దో వాటిని సెర్చ్ బార్‌లో సెలెక్ట్ చేసుకుని చెక్‌బాక్స్‌ను క్లిక్ చేసి డిలీట్ చేయండి. లేదంటే ఫలానా సంవత్సరానికి ముందు ఉన్న ఇ-మెయిల్స్ ఏవీ వద్దునుకుంటే before:<2022> అని సెర్చ్ చేస్తే అంతకంటే ముందున్న ఇ-మెయిల్స్ కనిపిస్తాయి. వాటిన్నింటినీ చెక్ బాక్స్ క్లిక్ చేసి ట్రాష్ బాక్స్ క్లిక్ చేస్తే ఆ తేదీకి ముందు మెయిల్స్ అన్నీ డిలీట్ అవుతాయి.
లార్జ్ ఇ-మెయిల్స్: మనకొచ్చే వాటిలో కొన్ని పెద్ద సైజు ఇ-మెయిల్స్ ఉంటాయి. వాటిని తొలగించడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ స్పేస్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం సెర్చ్‌బార్లో has:attachment larger: 5M అని సెర్చ్ చేయడం వల్ల 5 ఎంబీ కంటే ఎక్కువ సైజ్ ఉన్న మెయిల్స్‌ను తొలగించొచ్చు.
గూగుల్ ఫొటోస్: ఎక్కువ స్టోరేజీ ఆక్రమించే వాటిలో గూగుల్ ఫొటోస్ ఒకటి. ఇందులో ముందుగా అవసరం లేని వీడియోలను తొలగించడం వల్ల ఎక్కువ ఫ్రీ స్పేస్‌ను పొందొచ్చు. అలాగే డూప్లికేట్ ఇమేజ్‌లను డిలీట్ చేయడం ద్వారా స్టోరేజీని పొందొచ్చు.
గూగుల్ డ్రైవ్: మనకు నిత్య జీవితంలో అవసరం అయిన పీడీఎఫ్‌లను, డాక్యుమెంట్లను గూగుల్ డ్రైవ్‌లో భద్రపరుస్తుంటాం. ఇ-మెయిల్ తరహాలో size:larger:5M అని సెర్చ్ చేస్తే 5 ఎంబీ కంటే ఎక్కువ సైజున్న ఫైల్స్‌ను తొలగించుకోవచ్చు. పీడీఎఫ్ రూపంలో ఉన్న పుస్తకాలు, ముఖ్యమైన ఇతర డాక్యుమెంట్లు ఉంటే వాటిని డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరుచుకుని డ్రైవ్ నుంచి తొలగించుకోవడం ద్వారా ఎక్కువ స్టోరేజీని పొందొచ్చు.
Thanks for reading Gmail storage: Gmail storage showing full? Clean up like this..
No comments:
Post a Comment