Investment Tips: 30 లేదా 40ల్లో ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ ఇలా ఉంటే బెస్ట్.. ఆపదలు ఎదురైనా తట్టుకుంటారు..!
అన్ని వయసుల వారికి సంపాదన, ఆర్థిక అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. అలానే వయసును బట్టి ఇన్వెస్ట్‌మెంట్ (Investment) కూడా మారుతూ ఉండాలి. ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ అనేది ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ టాలరెన్స్‌కు అనుగుణంగా ఉండాలి.
అప్పుడే ఎలాంటి అవసరాలు, ఆపదలు ఎదురైనా తట్టుకునే సామర్థ్యం ఉంటుంది.
ఏజ్-బేస్డ్ అసెట్ అలకేషన్స్ ఎలా ఉండాలి? 30లు, 40లు, పదవీ విరమణ సమయంలో ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ ఎలా మారాలి? వంటి వివరాలను 'లైవ్‌మింట్'కు వివరించారు ఆల్ఫా క్యాపిటల్, అసోసియేట్ పార్ట్‌నర్ అజయ్ అగర్వాల్. ఆయన సలహాలు, సూచనలు తెలుసుకుందాం.
ఏజ్- బేస్డ్ అసెట్ అలకేషన్ అంటే, వయసు పెరిగేకొద్దీ ఇన్వెస్ట్‌మెంట్ రిస్క్ తగ్గుతూ రావాలి. ఇందులో ప్రధానంగా పోర్ట్‌ఫోలియోలోని ఈక్విటీ రేషియోను అడ్జస్ట్ చేస్తారు. ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌లు మంచి రిటర్న్స్ అందిస్తాయి, కానీ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈక్విటీ అలకేషన్ ఎంత ఉండాలో సులభంగా తెలుసుకోవచ్చు.
ఇందుకు ప్రస్తుత వయసును 100 నుంచి తీసివేయాలి. ఉదాహరణకు.. ఓ వ్యక్తి వయసు 25 ఏళ్లు అయితే, పోర్ట్‌ఫోలియోలో 75% ఈక్విటీ-బేస్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌లు ఉండవచ్చు. మిగిలిన 25% డెట్ ఫండ్స్, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సెక్యూరిటీలు ఉండాలి.
* 30లలో ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ : ముప్పైలలో ఎక్కువ కాలం ఇన్వెస్ట్‌మెంట్ చేసే ఆప్షన్ ఉంటుంది. రిటర్న్స్ కోసం మరింత రిస్క్ తీసుకునే వీలు ఉంటుంది. పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ భాగాన్ని ఇండివిడ్యువల్ స్టాక్‌లు, ఈక్విటీ ఫండ్స్ వంటి హైయర్-రిస్క్ అసెట్స్‌కి కేటాయించవచ్చు. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ రిస్క్‌ను తగ్గించాలనుకుంటే, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లలో(ULIPs) పెట్టుబడి పెట్టవచ్చు.
* 40 ఏళ్లలో ఇలా : నలభైల్లోకి ప్రవేశించినప్పుడు, బాండ్స్ వంటి స్థిరమైన పెట్టుబడుల నిష్పత్తి పెంచుతూ పోర్ట్‌ఫోలియోను రీబ్యాలెన్స్ చేయాలి. ఈక్విటీలు ఇప్పటికీ పోర్ట్‌ఫోలియోలో ఉన్నా.. పదవీ విరమణ సమీపిస్తున్నందున పొటెన్షియల్ వోలటాలిటీని తగ్గించడానికి బ్యాలెన్స్‌డ్ పోర్ట్‌ఫోలియో అవసరం. అదనంగా సొంత ఇంటి కోసం లేదా రెంటల్ ఇన్‌కమ్ పొందడానికి రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.
* బ్యాలెన్స్‌డ్ పోర్ట్‌ఫోలియో అప్రోచ్ : బ్యాలెన్స్‌డ్ పోర్ట్‌ఫోలియో కోసం ప్రయత్నించడం చాలా అవసరం. అంటే సాధారణంగా ఈక్విటీలో 40%, డెట్ ఫండ్స్‌లో 40% ఉండాలి. 5% ఎమర్జెన్సీ క్యాష్‌గా ఉంచాలి. కొత్త పెట్టుబడి అవకాశాలను అందుకోవడానికి మరో 5% కేటాయించాలి. ఇలాంటి బ్యాలెన్స్‌డ్ అప్రోచ్ స్థిరమైన రాబడిని లక్ష్యంగా చేసుకుంటూ రిస్క్‌ని మేనేజ్ చేయడంలో సహాయపడుతుంది.
* అసెట్ అలకేషన్ : పెట్టుబడిలో అసెట్ అలకేషన్ ఒక కీలకమైన అంశం. గోల్డ్, రియల్ ఎస్టేట్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, PPF, EPF వంటి వివిధ అసెట్ క్లాసెస్‌లో పెట్టుబడి నిధులను డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అసెట్స్‌కి ఇన్వెస్ట్‌మెంట్స్ ఎలా డివైడ్ చేస్తారనేది అలకేషన్ స్ట్రాటజీ నిర్ణయిస్తుంది.
ప్రధాన అసెట్ క్లాసెస్‌లో స్టాక్స్ (ఈక్విటీలు), బాండ్స్(ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సెక్యూరిటీలు), క్యాష్ లేదా సమానమైనవి ఉంటాయి. కమోడిటీస్, రియల్ ఎస్టేట్ వంటివి ఇతర అసెట్ క్లాసెస్ కిందకు వస్తాయి. అయితే డైవర్సిఫికేషన్ అనేది క్యాపిటల్‌ని రక్షించడానికి కీలకమైన వ్యూహం. మల్టిపుల్ అసెట్ క్లాసెస్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా, రిస్క్‌ని స్ప్రెడ్ చేస్తారు, ఏదైనా కేటరిగీలో డౌన్‌ఫాల్ ప్రభావాన్ని తగ్గిస్తారు. డైవర్సిఫికేషన్ ఊహించని మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి పెట్టుబడులు రక్షించడంలో సహాయపడుతుంది.
Thanks for reading Investment Tips: Best if investment strategy is like this in 30s or 40s.
No comments:
Post a Comment