Torn Notes: మీ దగ్గర చిరిగిన నోట్లు ఉన్నాయా? ఇలా సింపుల్ గా మార్చుకోవచ్చు..
మాములుగా మనకు నోట్ల కట్టల్లో లేదా ఏదైనా కొన్నప్పుడు అనుకోకుండా చిరిగిన నోట్లు వస్తుంటాయి.. ఇలాంటి వాటిని ఎక్కడా తీసుకోవడానికి అంగీకరించరు, కానీ కొంతమంది కొంత కమీషన్‌తో తీసుకోవడానికి ఒప్పుకుంటారు..
అయితే చాలా మందికి తెలియని విషయమేంటంటే వాటిని ఎలాంటి కమీషన్ లేకుండా బ్యాంకులలో మార్చుకోవచ్చు.. అదేలానో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఆర్బీఐ ప్రకారం.. చిరిగిన నోట్లను మార్చుకోవడానికి ఎలాంటి ఫారమ్ ఫిల్ చేయకుండానే మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఒక వ్యక్తి ఒకసారి 20 చిరిగిన నోట్లను మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా రూ. 5000 మించి ఉండకూడదు.. తక్కువ డ్యామేజ్ అయిన నోట్లకు అదే అమౌంట్ ను ఇస్తారు.. అలా కానీ పక్షంలో డ్యామేజ్ ఎక్కువగా అయితే మాత్రం పర్సంటెజ్ ప్రకారం డబ్బులను ఇస్తారు.. ఒకవేళా మీ దగ్గర చిరిగిన నోట్లు ఎక్కువగా ఉంటే బ్యాంకు వెంటనే మార్పిడి చేయదు, మొదట ఆ నోట్లను స్వీకరించి.. తరువాత మీ ఖాతాలో జమ చేస్తుంది…
ఇకపోతే ఈ చిరిగిన నోట్లపై సీరియల్ నెంబర్, మహాత్మా గాంధీ మార్క్, గవర్నర్ సంతకం వంటి గుర్తులు ఉంటే వాటిని బ్యాంకులు మార్చడానికి అంగీకరిస్తాయి. ఎక్కడైతే మీ దగ్గరున్న చిరిగిన నోట్లను మార్చాలనుకుంటారో అక్కడ ఖచ్చితంగా అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు.. బాగా చిరిగిన నోట్లకు ఎక్కువగా అమౌంట్ రాదు.. దానికి సగం మాత్రమే చెల్లిస్తారు.. ఉదాహరణకు ఒక నోటు 78 శాతం బాగుంటే దానికి ఫుల్ అమౌంట్ ఇస్తారు. అదే నోటు 39 శాతం ఉంటే దానికి కేవలం సగం డబ్బులను మాత్రమే ఇస్తారు.. ఇది ఆర్బీఐ బ్యాంకు రూల్.. కావాలని చించేసిన నోట్లను అస్సలు తీసుకోదు.. ఇది గుర్తుంచుకోండి..
Thanks for reading Torn Notes: Do you have torn notes? It can be changed as simple as this..
No comments:
Post a Comment