జియో ఏడో వార్షికోత్సవ ఆఫర్లు
టెలికం రంగంలోకి అడుగుపెట్టి ఏడేండ్లు అవుతున్న సందర్భంగా రిలయన్స్ జియో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. రూ.299 మొదలుకొని రూ.749, రూ.2,999 ప్లాన్లపై అదనపు డాటా, ఇతర ఆఫర్లను కూడా అందిస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈ నెల 30 వరకు మాత్రమే ఈ ప్లాన్లు అందుబాటులో ఉండనున్నాయి.
టెలికం రంగంలోకి అడుగుపెట్టి ఏడేండ్లు అవుతున్న సందర్భంగా రిలయన్స్ జియో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. రూ.299 మొదలుకొని రూ.749, రూ.2,999 ప్లాన్లపై అదనపు డాటా, ఇతర ఆఫర్లను కూడా అందిస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 30 వరకు మాత్రమే ఈ ప్లాన్లు అందుబాటులో ఉండనున్నాయి.
వీటిలో రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్‌పై రోజుకు 2.5 జీబీ మొబైల్ డాటాతోపాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతోపాటు వీటికి అదనంగా 21 జీబీ డాటా, ఏజియో యాప్‌తో దుస్తుల కొనుగోలుపై రూ.200, నెట్‌మెడ్స్‌పై 20 శాతం వరకు రాయితీ ఇస్తున్నది. అలాగే స్విగ్గీపై రూ.100 రాయితీ, రూ.149 విలువైన మెక్‌డొనాల్డ్ భోజనం ఉచితంగా అందిస్తున్నది. విమాన టికెట్‌పై రూ.1,500, యాత్రా.కామ్‌తో హోటల్ గదిని బుకింగ్ చేసుకున్నవారికి 15 శాతం రాయితీని కూడా ఇస్తున్నది.
Thanks for reading Jio Seventh Anniversary Offers
No comments:
Post a Comment