Let's see some important changes coming in financial matters in the month of October.
Changes from october అక్టోబర్ నెల వచ్చేస్తోంది. కొన్ని బ్యాంకులు అందించే ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ల గడువు నుంచి ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులను వినియోగించి విదేశాల్లో చేసే చెల్లింపుల వరకు అనేక మార్పులు రానున్నాయి. అలాగే, ఎల్‌ఐసీ పాలసీల పునరుద్ధరణకు ఇచ్చిన గడువూ అక్టోబర్ నెలలోనే తీరబోతోంది. ఇలా అక్టోబర్ నెలలో ఆర్థిక విషయాల్లో రానున్న పలు కీలక మార్పులేంటో చూద్దాం..
నచ్చిన కార్డు ఎంచుకోవచ్చు: వినియోగదారులు తమకు నచ్చిన పేమెంట్ నెట్‌వర్క్‌ను (రూపే, వీసా, మాస్టర్) ఎంచుకొనే వెసులుబాటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకొచ్చింది. అక్టోబర్ 1 డెబిట్/ క్రెడిట్/ ప్రీపెయిడ్ కార్డులు.. ఇలా ఏ కార్డు కావాలన్నా బ్యాంకులు నిర్ణయించవు. వినియోగదారులకు నచ్చిన కార్డును ఎంచుకొనే స్వేచ్ఛ ఉంటుంది.
ఇండియన్ బ్యాంక్ ఎఫ్‌డీ: ‘ఇండ్ ఉత్సవ్ 610’, ‘ఇండ్ సుప్రీమ్ 300 డేస్’ పేర్లతో ఇండియన్ బ్యాంక్ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం గడువు సెప్టెంబరు 30తో ముగియాల్సి ఉండగా.. ఆ గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించింది.
అమృత్ మహోత్సవ్ గడువు: ఐడీబీఐ బ్యాంక్ 375 రోజులు, 444 రోజుల గడువుతో ‘అమృత్ మహోత్సవ్’ ఎఫ్‌డీ పథకాలను గతంలోనే ప్రవేశపెట్టింది. అనేక సార్లు పొడిగించిన ఈ డిపాజిట్ గడువు అక్టోబర్ 31తో ముగియనుంది.
పాలసీల పునరుద్ధరణకు ఛాన్స్: ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరణ కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ కార్యక్రమం గడువు అక్టోబర్ 31తో ముగియనుంది. పాలసీల పునరుద్ధరణకు ఆలస్య రుసుములో కూడా ఎల్‌ఐసీ రాయితీ ఇస్తోంది.
కొత్త టీసీఎస్ రూల్స్: ఇంటర్నేషనల్ క్రెడిట్, డెబిట్ కార్డులు వినియోగించి విదేశాల్లో చేసే చెల్లింపులపై మూలం వద్ద పన్ను వసూలు (TCS)కు సంబంధించిన కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఏడాదికి రూ.7 లక్షలు మించి విదేశాల్లో చేసే ఖర్చులపై ఇకపై 20 శాతం వర్తిస్తుంది. ఇందులో విద్య, వైద్యం కోసం వెచ్చించే ఖర్చులకు మినహాయింపు ఉంటుంది.
ఇక బర్త్ సర్టిఫికెట్‌తోనే: జనన మరణాల నమోదు (సవరణ) చట్టం 2023 ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. దీని ప్రకారం.. దేశంలో జనన, మరణాలన్నీ ఇకపై ఆన్‌లైన్‌లో నమోదు కానున్నాయి. అలాగే, విద్యా సంస్థల్లో అడ్మిషన్, డ్రైవింగ్ లైసెన్స్ జారీ, ఓటరు జాబితా, ఆధార్ నంబర్, వివాహ నమోదు, ప్రభుత్వ ఉద్యోగంలో నియామకాల కోసం జనన ధ్రువీకరణ పత్రాన్ని సింగిల్ డాక్యుమెంట్‌గా వినియోగించుకునేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తోంది.
Thanks for reading Let's see some important changes coming in financial matters in the month of October.
No comments:
Post a Comment