Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, November 15, 2023

Exclusive article on the Unstoppable 'King', Kohli.


 Virat kohli: 50 సెంచరీలు.. తిరుగులేని ‘కింగ్‌’!

వరుస సెంచరీలు చేస్తే పరుగుల యంత్రం అని పొగిడిన వాళ్లే.. కాస్త గ్యాప్‌ రాగానే వెక్కిరించారు. కానీ, పడిలేచిన కెరటంలా.. మునుపటి ఫామ్‌ను అందుకుని.. సచిన్‌ రికార్డ్‌ను బద్దలుకొట్టి.. దటీజ్‌ కింగ్ కోహ్లీ అనిపించుకున్నాడు. 

సెంచరీల మీద సెంచరీలు చేస్తే అతడిని పరుగుల యంత్రం అన్నారు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా రికార్డులు తిరగరాస్తుంటే ఈ బ్యాట్‌కు దూకుడెక్కువ అని ప్రశంసించారు. అలాంటి పరుగుల మెషీన్‌ దూకుడుకు కాస్త గ్యాప్‌ వచ్చింది. కొనియాడిన నోళ్లే వెక్కిరించాయి. ప్రశంసించిన గొంతులే దుమ్మెత్తిపోశాయి. కానీ, అతడు కింగ్‌ కోహ్లీ.. పడిలేచిన కెరటంలా..  అగ్నిపర్వతం నుంచి వచ్చే లావాలా మళ్లీ ఉవ్వెత్తున ఎగిశాడు. ఎప్పటికీ సచిన్‌ రికార్డులను చేరుకోలేరు.. చేరువ కాలేరు అన్న అంచనాలను పటాపంచలు చేశాడు. 50వ సెంచరీతో వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డును నమోదు చేశాడు. అదీ కీలకమైన ప్రపంచకప్‌ సెమీస్‌లో ఈ అరుదైన రికార్డును అందుకున్నాడు. దటీజ్‌ కింగ్‌ కోహ్లీ!!

కోహ్లీ అంతర్జాతీయ కెరీర్ మొదలయ్యాక పైకి ఎదగడమే తప్ప కిందికి పడటం అన్నదే అతడి కెరీర్లో జరగనే లేదు. ఏ దేశంలో ఆడినా.. పిచ్ ఎలాంటిదైనా.. అవతల ఉన్నది ఎలాంటి బౌలర్లయినా అతడికి లెక్క ఉండదు. క్రీజులో అడుగు పెట్టాడంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపించాల్సిందే. అలుపు సొలుపు లేకుండా పరుగులు రాబట్టడం.. మంచినీళ్ల ప్రాయంగా శతకాలు బాదడం.. అందరూ ఇబ్బంది పడే ఛేదనలో మొనగాడిలా నిలబడి జట్టును గెలిపించడం.. అదీ కోహ్లీ అంటే. మామూలుగా ఒత్తిడి ఎక్కువైతే ఎలాంటి బ్యాటర్ అయినా తడబడతాడు. కానీ ఎంత ఒత్తిడి ఉంటే అంతగా రెచ్చిపోవడం కోహ్లీకే సాధ్యం. కోహ్లీని ఎవరైనా రెచ్చగొడితే.. అతడిలోని అత్యుత్తమ ఆటగాడు బయటికి వస్తాడు. అందుకే వేరే జట్ల మాజీ ఆటగాళ్లు.. కోహ్లీతో పెట్టుకోవద్దని, అతణ్ని రెచ్చగొట్టొద్దని తమ ఆటగాళ్లను హెచ్చరించేవారు.

ఇదే పతాక స్థాయి అనుకున్న ప్రతిసారీ.. అంతకుమించి ఉత్తమ ప్రదర్శన చేసి ఇంకా తనకు తానే సాటి అనిపించిన ఆటగాడు విరాట్. వివిధ ఫార్మాట్లలో అతడి పరుగులు.. సగటు.. శతకాలు.. ఇలాంటి గణాంకాలు చూసి క్రికెట్ పండితులు నోరెళ్లబెట్టారు. మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పటి కంటే ఛేదనల్లో ఎక్కువ పరుగులు, సగటు, శతకాలు నమోదు చేయడం అతడికే చెల్లింది. క్రికెట్ చరిత్రలో అప్పటిదాకా ఎవరికీ ఇలాంటి ఘనతలు సాధ్యం కాలేదు. భవిష్యత్తులో కూడా అలాంటి ఆటగాడు వస్తాడని ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. ఇలా పతాక స్థాయిలో సాగిపోతున్న విరాట్ కెరీర్ 2019-2023 మధ్య మాత్రం ఊహించని పతనం చవిచూసింది.

అదే అతడి ప్రత్యేకత..

సెంచరీ కొట్టడాన్ని ఒక మామూలు విషయంగా మార్చేసి.. ఒక ఏడాదిలో పది సెంచరీలు కొడితే కోహ్లీకి ఇది మామూలే కదా అని అభిమానులు అనకునే పరిస్థితి కల్పించిన ఘనుడు కోహ్లీ. అలాంటి ఆటగాడు ఒక్క శతకం కూడా సాధించకుండా రెండున్నరేళ్లకు పైగా ఉన్నాడంటే అంతకంటే అనూహ్యమైన విషయం మరొకటి ఉండదు. ఎలాంటి ఆటగాడైనా ఫామ్ కోల్పోవడం, కొంత కాలం పరుగుల కోసం తంటాలు పడటం, సెంచరీలకు దూరం కావడం మామూలే. ఐతే కోహ్లీ స్థాయి ఆటగాడు రెండున్నరేళ్లు మూడంకెల స్కోరు చేయకపోవడం మాత్రం అనూహ్యం. ఫలానా ఫార్మాట్ అని తేడా లేకుండా అన్నింట్లోనూ అతడు విఫలమయ్యాడు. 

 కోహ్లీ అంటే బెంబేలెత్తిన బౌలర్లు, ప్రత్యర్థి జట్లు.. అతడు క్రీజులోకి వస్తుంటే అస్సలు భయపడకపోవడం, తన వికెట్ పడినా పెద్దగా సంబరాలు చేసుకోకపోవడం ఆ పేలవ దశలోనే చూశారు అభిమానులు. సెంచరీల కోసం చూడ్డం మాని అతడు 50 దాటినా సంబరపడే పరిస్థితి వచ్చింది ఒక దశలో. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలోనూ కెప్టెన్సీకి దూరం కావడం.. ఐపీఎల్‌లో సైతం కెప్టెన్సీని విడిచిపెట్టడంతో కోహ్లీ ప్రభ మరింత తగ్గింది. దీంతో విరాట్ మళ్లీ మునుపటి స్థాయిని అందుకోలేడని.. ఇక అతడు రిటైరవడమే తరువాయి అనే చర్చ జరిగింది. కానీ అలాగే జరిగి ఉంటే.. అతను కోహ్లీ ఎందుకవుతాడు?

అక్కడ్నుంచి మొదలు..

సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ గత ఏడాది ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్‌పై సెంచరీ సాధించడంతో విరాట్ మళ్లీ తన పరుగుల ప్రవాహాన్ని మొదలుపెట్టాడు. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ మీద ఆడిన 84 సంచలన ఇన్నింగ్స్‌తో అతడి పేరు మార్మోగింది. మళ్లీ మునుపటి కోహ్లీని ఆ మ్యాచ్‌లోనే చూశారు అభిమానులు. క్రికెట్ ప్రపంచమంతా కింగ్ కింగే అని కొనియాడింది. ఇక కోహ్లీఆగనే లేదు. 2023లో అతడి జోరు మామూలుగా లేదు. ఈ ఏడాది కోహ్లీ అంతర్జాతీయ పరుగులు 1500 దాటాయి. ఆరు సెంచరీలు కూడా సాధించాడు. ప్రపంచకప్ కంటే ముందు ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో అద్భుత శతకంతో అభిమానులను ఉర్రూతలూగించాడు. 

ఇక ప్రపంచకప్‌లో అయితే అతడి వీరవిహారం మామూలుగా లేదు. ఇప్పటి వరకు 10 ఇన్నింగ్స్‌ల్లో 101.57 సగటుతో 711 పరుగులు సాధించాడు. అందులో మూడు శతకాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాపై 85, న్యూజిలాండ్‌పై 95, శ్రీలంకపై 88 పరుగుల వద్ద ఔటై.. సచిన్‌ రికార్డు సమం చేయడానికి అడుగు దూరంలో ఉండిపోయిన విరాట్.. దక్షిణాఫ్రికా మీద అజేయ శతకం (101*) చేసి పని పూర్తి చేశాడు. తాజాగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఆ రికార్డునూ అధిగమించేశాడు.

Thanks for reading Exclusive article on the Unstoppable 'King', Kohli.

No comments:

Post a Comment