TCS NQT 2023: టీసీఎస్ గోల్డెన్ ఛాన్స్.. ఒకే పరీక్ష.. 2700+కంపెనీలు.. 1.6లక్షల జాబ్స్!
టీసీఎస్ ఎన్‌క్యూటీలో ప్రతిభకనబరిస్తే.. టీసీఎస్, టీవీఎస్ మోటార్స్, జియో, ఏసియన్ పెయింట్స్ సహా దాదాపు 2700+ ఐటీ, ఐటీయేతర కార్పొరేట్ కంపెనీల్లో 1.6లక్షలకు పైగా ఉద్యోగాలను దక్కించుకొనే ఛాన్స్ మీ సొంతం.
మీరు బీటెక్, పీజీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే, మీకో సువర్ణావకాశాన్ని అందిస్తోంది ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS). ఆఫ్ క్యాంపస్ డిజిటల్ హైరింగ్ కోసం టీసీఎస్ ఎన్‌క్యూటీ పరీక్ష(TCS NQT)కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పరీక్షలో ప్రతిభకనబరిస్తే.. టీసీఎస్, టీవీఎస్ మోటార్స్, జియో, ఏసియన్ పెయింట్స్ సహా దాదాపు 2700+ ఐటీ, ఐటీయేతర కార్పొరేట్ కంపెనీల్లో 1.6లక్షలకు పైగా ఉద్యోగాలను దక్కించుకొనే అవకాశాలను మీకు మరింత చేరువ చేస్తోంది. గరిష్ఠంగా రూ.19లక్షల వరకు వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాన్ని పొందొచ్చు. టీసీఎస్ ఎన్‌క్యూటీ పరీక్ష గురించి కొన్ని ముఖ్యాంశాలివే..
అభ్యర్థులు తొలుత నేషనల్ క్వాలిఫయర్ టెస్టు (TCS NQT)కు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందులో మంచి స్కోరు సాధించాలి. ఈ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా పలు కంపెనీల్లో ఉద్యోగాలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకుంటే.. కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తాయి.
డిసెంబర్‌లో జరగనున్న పరీక్షకు నవంబర్ 27లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పరీక్ష తేదీ: పరీక్ష డిసెంబర్ 9న నిర్వహిస్తారు.
ఈ పరీక్షకు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?: 2018 -2024 పాసింగ్ అవుట్ బీటెక్ విద్యార్థులు. ప్రీ ఫైనల్ లేదా ఫైనల్ పరీక్ష రాస్తున్న యూజీ, పీజీ, డిప్లొమా విద్యార్థులు. రెండేళ్లు మించకుండా పనిలో అనుభవం కలిగిన వారు సైతం ఈ పరీక్ష రాసేందుకు అర్హులు.
వయో పరిమితి: అభ్యర్థుల వయసు కనీసం 17 ఏళ్లు ఉండాలి. గరిష్ఠంగా 30 ఏళ్లు మించరాదు.
టీసీఎస్ ఎన్‌క్యూటీలో సాధించిన స్కోరుకు రెండేళ్ల వరకే వ్యాలిడిటీ ఉంటుంది. ఈ స్కోరును మెరుగుపరుచుకొనేందుకు ఎన్నిసార్లయినా పరీక్ష రాయొచ్చు. అభ్యర్థి సాధించిన ఉత్తమ స్కోరునే పరిగణలోకి తీసుకుంటారు.
పరీక్ష రాసిన తర్వాత ఫలితాలను మీ రిజిస్టర్ ఈ మెయిల్ ఐడీకి పంపిస్తారు. మీ స్కోరు కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ పరీక్షకు కటాఫ్ మార్కులంటూ ఏమీ ఉండవు. అభ్యర్థుల ప్రతిభను తెలిపే ఈ పరీక్షకు కట్-ఆఫ్ స్కోర్ లేదా పాస్/ఫెయిల్ అనే ప్రమాణాలను నిర్ణయించలేదు. వివిధ అంశాల్లో అభ్యర్థుల సామర్థ్యాన్ని అప్పటికప్పుడు అంచనా వేసి స్కోరు ఇస్తారు.
టీసీఎస్ ఎన్‌క్యూటీలో స్కోరు సాధించిన అభ్యర్థులకు జాబ్ కచ్చితంగా వస్తుందని చెప్పలేం. ఈ స్కోరుతో అభ్యర్థికి ఉద్యోగం వచ్చే అవకాశాలు మరింతగా మెరుగ్గా ఉంటాయి. తుది ఎంపిక మాత్రం ఆయా సంస్థల ఇష్టంపైనే ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి.
దేశవ్యాప్తంగా నిర్దేశించిన వివిధ పరీక్షా కేంద్రాలలో ప్రతి 4 వారాలకు ఈ పరీక్షలను షెడ్యూల్ చేస్తారు. TCS NQT స్కోర్‌కార్డ్ పరీక్షలోని ప్రతి విభాగంలో అభ్యర్థుల పనితీరును సూచిస్తుంది. TCS NQT స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొనే ఇతర కార్పొరేట్ సంస్థల్లోనూ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పరీక్ష ఇంగ్లిష్‌లో ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉండవు.
ఈ పరీక్షలో అక్రమాలకు పాల్పడిన అభ్యర్థులకు ఏడాది పాటు పరీక్ష రాసేందుకు అనుమతించరు. పూర్తి వివరాలను ఈ కింది లింక్‌పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
Thanks for reading TCS NQT - Your Gateway to Thousands of Top Jobs
No comments:
Post a Comment