PM Kisan: ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. జాబితాలో మీ పేరు ఉందా? చెక్ చేసుకోండి!
pmkisan.gov.in.
PM Kisan Samman Nidhi
పీఎం కిసాన్ నిధులను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఝార్ఖండ్ నుంచి విడుదల చేయనున్నారు. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి.
PM Kisan రైతులకు పెట్టుబడి సాయం కోసం కేంద్రం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) డబ్బులు బుధవారం బ్యాంకు ఖాతాల్లో జమకానున్నాయి. 15వ విడత కింద అర్హులైన దాదాపు 8కోట్లమందికి పైగా రైతుల ఖాతాల్లో రూ.2వేలు చొప్పున జమ చేయనున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఝార్ఖండ్‌లోని ఖుంటిలో బుధవారం ఉదయం 11.30గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులు విడుదల చేస్తారని పేర్కొంది. ఎవరైతే ఈ-కేవైసీ (eKYC) పూర్తి చేస్తారో వారి ఖాతాల్లో నిధులు జమ అవుతాయి.
దేశవ్యాప్తంగా రైతులకు లబ్ధి జరిగేలా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరిట పథకాన్ని అమలు చేస్తోంది. ఏడాదిలో మూడు దఫాలుగా రూ.6వేలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంటుంది. ఒక్కో విడతలో అర్హులైన రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు చొప్పున జమ చేస్తున్నారు. కేంద్రం ఇప్పటిదాకా ఈ పథకం కింద 14 విడతలుగా నిధులను విడుదల చేసింది. తాజాగా బుధవారం (నవంబర్ 15న) 15వ విడత నిధులు విడుదల చేయనుంది. ఈ-కేవైసీ చేయించుకున్న వారిని లబ్దిదారులుగా గుర్తించి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. అయితే, లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు.
తొలుత https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
ఆ తర్వాత బెనిఫిషియరీ లిస్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
ఈ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే(https://pmkisan.gov.in) మరో పేజీకి రీ డైరెక్ట్ అవుతుంది.
అక్కడ లబ్ధిదారుని రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామాలను ఎంచుకుని ‘గెట్ రిపోర్ట్’పై క్లిక్ చేస్తే లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది.
ఏదైనా సమాచారం కోసం పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నెంబరు 155261 / 011-24300606కు కాల్ చేయొచ్చు.
Thanks for reading PM Kisan Yojana: 15th installment will come on this date, check your name in the beneficiary list
No comments:
Post a Comment