RRC: రైల్వేలో 6608 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు
Railway: రాత పరీక్ష లేకుండానే రైల్వేలో ఖాళీల భర్తీ
* 6,608 అప్రెంటిస్‌లకు నోటిఫికేషన్లు
* టెన్త్, ఐటీఐ పాసైతే చాలు
దేశవ్యాప్తంగా వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి సంబంధించి రైల్వే నియామక సంస్థలు ఇటీవల ప్రకటనలు విడుదల చేశాయి. తాజాగా ఈస్ట్ సెంట్రల్ రైల్వే- 1,832; నార్త్ సెంట్రల్ రైల్వే- 1,697; నార్త్ ఈస్ట్రన్ రైల్వే- 1,104; కొంకణ్ రైల్వే- 190; సౌత్ ఈస్ట్రన్ రైల్వే- 1,785 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతున్నాయి. పదో తరగతి, ఐటీఐ కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు నిర్దేశించిన తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి, ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ధ్రువ పత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వివిధ రైల్వే జోన్‌లలో అప్రెంటిస్‌షిప్ వివరాలు...
* ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1,832 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు
* నార్త్ సెంట్రల్ రైల్వేలో 1,697 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు
* నార్త్ ఈస్ట్రన్ రైల్వేలో 1,104 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు
* సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో 1,785 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు
Thanks for reading RRC: 6608 Act Apprentice Vacancies in Railways
No comments:
Post a Comment