ECIL: హైదరాబాద్ ఈసీఐఎల్‌లో 363 గ్రాడ్యుయేట్/ డిప్లొమా అప్రెంటిస్ ఖాళీలు
Electronics Corporation of India Limited, Hyderabad invites applications for the engagement of apprenticeship at ECIL Hyderabad.
హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ- ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్)… ఏడాది అప్రెంటిస్‌షిప్ శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 363 గ్రాడ్యుయేట్/ డిప్లొమా అప్రెంటిస్ ఖాళీలు భర్తీ కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 15వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రకటన వివరాలు:
1. గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్: 250 ఖాళీలు
2. డిప్లొమా/ టెక్నీషియన్ అప్రెంటిస్: 113 ఖాళీలు
ఇంజినీరింగ్ బ్రాంచ్: ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్, ఈఈఈ, సివిల్, ఈఐఈ.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
మొత్తం ఖాళీల సంఖ్య: 363.
వయోపరిమితి: 31.12.2023 నాటికి 25 సంవత్సరాలు మించకూడదు.
స్టైపెండ్: నెలకు జీఈఏలకు రూ.9000, టీఏ అభ్యర్థులకు రూ.8000.
శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
ఎంపిక విధానం: డిప్లొమా, బీఈ, బీటెక్ పరీక్షల్లో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్థలం: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, టీఐఎఫ్‌ఆర్ రోడ్, ఈసీఐఎల్, హైదరాబాద్.
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు, రిజిస్ట్రేషన్ ప్రారంభం: 05.12.2023.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.12.2023.
ధ్రువపత్రాల పరిశీలన తేదీలు: 21, 22.12.2023.
ప్రవేశానికి గడువు తేదీ: 31.12.2023.
అప్రెంటిస్‌షిప్ శిక్షణ ప్రారంభం: 01.01.2024
Thanks for reading ECIL Apprentice Recruitment 2023 Notification Out for 363 Vacancies.
No comments:
Post a Comment