Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, December 20, 2023

UPSC CDS 2024 - Notification, Eligibility Criteria, Application Form, Dates, Exam Pattern


UPSC CDSE: యూపీఎస్సీ- కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (1), 2024 



ఆర్మీ, నేవీ, ఏయిర్‌ ఫోర్సుల్లో లక్షణమైన ఉన్నతోద్యోగాలెన్నో ఉన్నాయి. ఉమ్మడి పరీక్షలో చూపిన ప్రతిభతో వీటిలో అవకాశం పొందవచ్ఛు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్‌సీ) నిర్వహిస్తోన్న కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌(సీడీఎస్‌ఈ) వీటికి దారిచూపుతోంది. ఇందులో మెరిసినవారు శిక్షణ అనంతరం త్రివిధ దళాల్లో మంచి వేతనంతో సేవలు అందించవచ్చు. భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు. తాజాగా సీడీఎస్‌ఈ 2024(1) ప్రకటన వెలువరించింది. డిగ్రీ పూర్తిచేసుకున్న అవివాహిత పురుషులు, మహిళలు ద్వారా జనవరి 9వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రకటన వివరాలు...

* యూపీఎస్సీ- కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (1), 2024 

విభాగాల వారీ ఖాళీలు:

1. ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎంఏ), దెహ్రాదూన్- 100

2. ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్‌ఏ), ఎజిమల- 32

3. ఎయిర్ ఫోర్స్ అకాడమీ(ఏఎఫ్‌ఏ), హైదరాబాద్- 32

4. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మద్రాస్), ఓటీఏ ఎస్‌ఎస్‌సీ మెన్‌ నాన్‌ టెక్నికల్‌- 275

5. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మద్రాస్), ఓటీఏ ఎస్‌ఎస్‌సీ ఉమెన్‌ నాన్‌ టెక్నికల్‌- 18.

మొత్తం ఖాళీలు: 457. 

విద్యార్హత: మిలిటరీ అకాడెమీ, ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడెమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సరిపోతుంది. నేవల్‌ అకాడెమీ ఉద్యోగాలకు ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులు అర్హులు. ఏయిర్‌ ఫోర్స్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ చదివుండాలి. ఓటీఏ ఎస్‌ఎస్‌సీ నాన్‌ టెక్నికల్‌ పోస్టులకు మాత్రమే మహిళలు అర్హులు. చివరి సంవత్సరం పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: ఇండియన్‌ మిలటరీ అకాడెమీ, నేవల్‌ అకాడెమీలకు జనవరి 2, 2001 కంటే ముందు; జనవరి 1, 2006 తర్వాత జన్మించినవారు అనర్హులు. ఏయిర్‌ ఫోర్స్‌ అకాడమీ పోస్టులకు జనవరి 2, 2001 కంటే ముందు, జనవరి 1, 2005 తర్వాత జన్మించినవారు అనర్హులు. ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ పోస్టులకు జనవరి 2, 1999 కంటే ముందు, జనవరి 1, 2005 తర్వాత జన్మించినవారు అనర్హులు.

ఎంపిక ప్రక్రియ: రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఫర్‌ ఇంటెల్లిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్ట్‌, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష తదితరాల అధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: ఒక్కో పేపర్‌కు వంద చొప్పున మొత్తం 300 మార్కులకు ఇంగ్లిష్‌, జనరల్‌ నాలెడ్జ్‌, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు వ్యవధి 2 గంటలు. ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడెమీ (ఓటీఏ) పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు మ్యాథ్స్‌ పేపర్‌ రాయనవసరం లేదు.

ఇంటర్వ్యూ: ఇంటర్వ్యూ విభాగానికి 300 మార్కులు కేటాయించారు. కేవలం ఓటీఏ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి ఇది 200 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూలో రెండు దశలు ఉంటాయి. ఇందులోనూ విజయవంతమైతే వైద్య పరీక్షలు నిర్వహించి పరీక్ష, ఇంటర్వ్యూ మార్కుల మెరిట్‌ ప్రాతిపదికన శిక్షణలోకి తీసుకుంటారు.

శిక్షణ, ఉద్యోగం: అభ్యర్థులు తమ ప్రాధాన్యం, మెరిట్‌ ప్రకారం ఆర్మీ, నేవీ, ఏయిర్‌ ఫోర్స్‌, ఓటీఏ వీటిలో ఏదో ఒక చోట అవకాశం పొందుతారు. మిలటరీ అకాడెమీకి ఎంపికైనవాళ్లకు ఇండియన్‌ మిలటరీ అకాడమీ దెహ్రాదూన్‌లో శిక్షణ ఉంటుంది. నేవల్‌ అకాడమీలో చేరినవాళ్లకు కేరళలోని ఎజిమాలలో శిక్షణ నిర్వహిస్తారు. ఏయిర్‌ ఫోర్స్‌ అకాడమీకి ఎంపికైనవారికి పైలట్‌ శిక్షణ హైదరాబాద్‌లో ఉంటుంది. ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీ పోస్టులకు ఎంపికైనవారు చెన్నైలో శిక్షణలో పాల్గొంటారు. శిక్షణ పూర్తిచేసుకున్నవారికి ఆర్మీ, ఓటీఏలో లెప్టినెంట్‌, నేవీలో సబ్‌ లెప్టినెంట్‌, ఏయిర్‌ ఫోర్స్‌లో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాతో కెరియర్‌ ప్రారంభమవుతుంది. 

దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు లేదు. మిగిలినవారు రూ.200 చెల్లించాలి.

ముఖ్య తేదీలు..........

ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: 20-12-2023 నుంచి 09-01-2024 వరకు.

దరఖాస్తు సవరణ తేదీలు: 10.01.2024 నుంచి 16.01.2024 వరకు

పరీక్ష తేదీ: 21-04-2024.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం.

Website Here

Thanks for reading UPSC CDS 2024 - Notification, Eligibility Criteria, Application Form, Dates, Exam Pattern

No comments:

Post a Comment