Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, December 19, 2023

SATHEE: 'Sathee' help for JEE, NEET preparation


 SATHEE: జేఈఈ, నీట్‌ సన్నద్ధతకు 'సాథీ' సాయం

* అందుబాటులో కేంద్ర విద్యా శాఖ పోర్టల్‌

దిల్లీ: ఐఐటీ ఖరగ్‌పుర్‌తో కలిసి కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ సాథీ (SATHEE- సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌, టెస్ట్‌ అండ్‌ హెల్ప్‌ ఫర్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌) అనే పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా జేఈఈ, నీట్‌ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తోంది. పోటీ పరీక్షల సన్నద్ధతను మెరుగుపరుచుకొనేందుకు ఉపయోగపడే ఈ వేదిక గురించి అవగాహన కల్పించాలని అన్ని రాష్ట్రాలను కోరుతూ లేఖలు రాసింది. డిసెంబర్‌ 12 నాటికి దేశ వ్యాప్తంగా 60వేల మందికి పైగా విద్యార్థులు సాథీ(SATHEE)లో రిజిస్టరైనట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డా. సుభాష్‌ సర్కార్‌ లోక్‌సభలో వెల్లడించారు. ఈ పోర్టల్‌లో జేఈఈకి 45 రోజులు, నీట్‌కు 60 రోజుల క్రాష్‌ కోర్సులతో పాటు మాక్‌ టెస్ట్‌లు, ప్రాక్టీస్‌ క్వశ్చన్లు, వీడియో లెక్చర్స్‌, వెబినార్‌లు అందుబాటులో ఉన్నాయి. జేఈఈ, ఇతర ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు సహకరించేలా 45 రోజుల క్రాష్‌ కోర్సును ఇటీవల ప్రారంభించింది. ఐఐటీ టాపర్లు, విద్యావేత్తలు, సబ్జెక్టు నిపుణులతో ఈ వేదిక ద్వారా శిక్షణ ఇస్తోంది. ఇంగ్లిష్‌తో పాటు మొత్తం అయిదు భాషల్లో ఈ కోర్సు అందుబాటులో ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. అఖిలభారత సాంకేతిక విద్యా మండలి (AICTE) దీని కోసం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI) ఆధారిత ట్రాన్సిలేషన్‌ టూల్‌ను అభివృద్ధి చేయగా.. ఇది 22 భారతీయ భాషల్లో పనిచేస్తుంది. ఈ టూల్‌ గురించి, దాని వినియోగంపై పలు విద్యా సంస్థలు/ కళాశాలల్లో వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు నిర్వహించినట్లు కేంద్రం తెలిపింది.

SATHEE WEBSITE HERE

Thanks for reading SATHEE: 'Sathee' help for JEE, NEET preparation

No comments:

Post a Comment