Jobs in Indian Oil Corporation (IOCL)
IOCL: ఐవోసీఎల్‌లో 1,603 ట్రేడ్/ టెక్నీషియన్/ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు
ముంబయిలోని అతిపెద్ద భారత ప్రభుత్వ రంగ సంస్థ- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, మార్కెటింగ్ డివిజన్- కింద పేర్కొన్న విభాగాల్లో ట్రేడ్/ టెక్నీషియన్/ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలున్న రాష్ట్రాలు: తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, దమణ్ అండ్ డయ్యూ, దాద్రా అండ్ నగర్ హవేలీ, పశ్చిమ్ బెంగాల్, బిహార్, ఒడిశా, ఝార్ఖండ్, అసోం, సిక్కిం, అండమాన్ అండ్ నికోబార్ దీవ్స్, త్రిపుర, నాగాలాండ్, మిజోరం, మేఘాలయ, మణిపూర్ అండ్ అరుణాచల్ ప్రదేశ్, దిల్లీ, హరియాణా, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము అండ్ కశ్మీర్, లడఖ్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్.
ఖాళీల వివరాలు:
1. ట్రేడ్ అప్రెంటిస్
2. టెక్నీషియన్ అప్రెంటిస్
3. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్/ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్
మొత్తం ఖాళీలు: 1,603.
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, మెషినిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, రిటైల్ సేల్స్ అసోసియేట్ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీబీఏ, బీఏ, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 30-11-2023 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, వైద్య పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 16-12-2023.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05-01-2024.
Thanks for reading Jobs in Indian Oil Corporation (IOCL)
No comments:
Post a Comment