APPSC Group2: ఒక్క పోస్టుకు 446 మంది పోటీ!
* గ్రూపు-2 దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు
* ఫిబ్రవరి 25వ తేదీన ప్రాథమిక రాత పరీక్ష
గ్రూపు-2 నోటిఫికేషన్ అనుసరించి దరఖాస్తుల స్వీకరణ గడువు తేదీని ఏపీపీఎస్సీ పొడిగించింది. తొలుత ప్రకటించిన ప్రకారం దరఖాస్తుల స్వీకరణ బుధవారం(జనవరి 10)తో ముగిసింది. అయితే.. ఆన్‌లైన్‌లో పంపడంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. సర్వర్‌పై ఒత్తిడి పెరిగి అభ్యర్థులు ఎక్కువ సమయం నిరీక్షించాల్సి వచ్చింది. కొద్దిరోజుల నుంచే ఈ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు స్వీకరణ గడువును జనవరి 17 వరకు పొడిగించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి బుధవారం(జనవరి 10) ఓ ప్రకటనలో తెలిపారు. తొలుత ప్రకటించిన ఫిబ్రవరి 25వ తేదీన రాత పరీక్ష యథాతథంగా జరుగుతుందని వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణ గతనెల 21 నుంచి ప్రారంభం కాగా ఇప్పటివరకు సుమారు 4 లక్షలమంది పంపారు. గ్రూపు-2 కింద ప్రకటించిన 897 పోస్టుల్ల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 331, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు 566 ఉన్నాయి. ఒక్కొక్క పోస్టుకు 446 మంది పోటీపడుతున్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు తేదీ ముగిసేనాటికి అభ్యర్థుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.
Thanks for reading appsc group2: 446 candidates for one post!
No comments:
Post a Comment