Ayodhya Ram Mandir: రామ్‌లల్లా దర్శనానికి విధివిధానాలివే!
జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం పూర్తయ్యాక అయోధ్యను సందర్శించాలని చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఇందుకు ఎటువంటి విధివిధానాలు అనుసరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రామాలయంలో బాలరామునికి రోజుకు ఐదుసార్లు హారతులు ఇవ్వనున్నారు. అయితే భక్తులు మూడు హారతులను మాత్రమే దర్శించుకోగలుగుతారు. ఈ హారతులు ఉదయం 6:30 గంటలకు, మధ్యాహ్నం 12:00 గంటలకు, సాయంత్రం 7:30 గంటలకు నిర్వహిస్తారు. ఇక శ్రీరాముని దర్శనం విషయానికి వస్తే ఉదయం 6 నుండి 11.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు.
అయోధ్యలో బాలరాముని దర్శనం కోసం ముందుగా రిజిస్టేషన్ చేసుకోవాలి. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం (https://online.srjbtkshetra.org)
ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు పొందాలనుకుంటే ఆలయం సమీపంలోని కౌంటర్ వద్దకు వెళ్లి, ప్రభుత్వం ధృవీకరించిన గుర్తింపు కార్డును చూపించి, టికెట్ పొందవచ్చు. కాగా పదేళ్లకన్నా తక్కువ వయసుగల పిల్లలకు దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. దర్శనం కోసం టిక్కెట్‌తో పాటు ఐడీప్రూప్ ప్రూఫ్‌ను ఖచ్చితంగా వెంట తీసుకువెళ్లాలి. ఎవరైనా భక్తుడు తన టిక్కెట్‌ను రద్దు చేసుకుంటే, ఆ స్లాట్ మరో భక్తుడికి అందుబాటులోకి వస్తుంది.
దర్శనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక, దర్శనానికి 24 గంటల ముందు సంబంధిత భక్తునికి మెసేజ్ లేదా మెయిల్ వస్తుంది. దర్శనానికి 24 గంటల ముందు భక్తుడు తన టిక్కెట్‌ను రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాగా స్త్రీలు, పురుషులు సంప్రదాయ దుస్తులలో మాత్రమే దర్శనానికి రావాలి. పురుషులు ధోతీ-కుర్తా లేదా కుర్తా, పైజామా.. మహిళలు చీర, దుపట్టాతో కూడిన పంజాబీ దుస్తులు లేదా దుపట్టాతో చుడీదార్ సూట్ ధరించి శ్రీరాముని దర్శనానికి రావచ్చు.
Thanks for reading Ayodhya Ram Mandir: రామ్‌లల్లా దర్శనానికి విధివిధానాలివే!
No comments:
Post a Comment