JIO: జియో నుంచి రిపబ్లిక్ డే ఆఫర్.. ఊహకందని బెనిఫిట్స్
రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా ఇప్పటికే పలు ఈ కామర్స్ సంస్థలు రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా పలు ఆఫర్లను అందిస్తోన్న విషయం తెలిసిందే. క్లాతింగ్ మొదలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ వరకు భారీ ఆఫర్లను ప్రకటించాయి.
ఈ నేపథ్యంలో ప్రముఖ టెలికం సంస్థ జియో సైతం తన యూజర్ల కోసం మంచి ఆఫర్‌ను ప్రకటించింది.
అన్‌లిమిటెడ్ కాల్స్, డేటాతో పాటు మరెన్నో బెనిఫిట్స్‌ను అందిస్తున్నారు. జియో కొత్తగా తీసుకొచ్చిన రీఛార్జ్ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. జియో రిపబ్లిక్ డే ఆఫర్‌లో భాగంగా రూ. 2999 ప్లాన్‌ను తీసుకొచ్చారు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే ఎన్నో అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ స్పెషల్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2.5 జీబీ డేటా పొందొచ్చు. వీటితో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు ఉచితంగా పొందొచ్చు. ఈ లెక్కన ప్రతీనెల రూ. 230 అవుతుందన్నమాట.
జియో అందిస్తోన్న ఈ ఆఫర్‌లో భాగంగా ఏజియో, టిరా, ఎక్సిగో, స్విగ్గీ, రిలయన్స్ డిజిటల్‌పై ప్రత్యేకంగా డిస్కౌంట్ పొందొచ్చు. ఏజియోలో రూ. 2500 విలువ చేసే కొనుగోళ్లపై రూ. 500 తగ్గింపు పొందొచ్చు. అలాగే టిరాలో రూ. 1000 వరకు కొనుగోళ్లపై 30 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్సిగోలో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటే రూ. 1500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. స్విగ్గీ కూపన్స్ ద్వారా రూ. 250 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. రిలయన్స్ డిజిటల్లో కొనుగోలు చేస్తే రూ. 5వేలు విలువ చేసే కొనుగోళ్లపై 10శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
జియో రూ. 2999తో రీఛార్జ్ చేసుకుంటే కూపన్స్ పొందొచ్చు. ఈ రీఛార్జ్ చేసుకుంటే.. మైజియో కౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. వాటిల్లోని కోడ్స్‌ని కాపీ చేసుకుని, పార్ట్నర్ యాప్స్/ వెబ్‌సైట్స్‌లో అప్లై చేసుకుంటే డిస్కౌంట్ పొందొచ్చు.అయితే కూపన్లకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఈ ఆఫర్ జనవరి 15 నుంచి 31 వరకు అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు.. జియో, జియోటీవీ, జియోక్లౌడ్ వంటి రిలయన్స్ జియో యాప్స్‌ని కూడా పొందవచ్చు.
Thanks for reading Jio: Republic Day Offer from Jio
No comments:
Post a Comment