APRDC CET 2024 Notification
APRDC CET: ఏపీ ఆర్‌డీసీసెట్-2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నాగార్జునసాగర్‌లోని రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యాసంవత్సరానికి డిగ్రీ(ఆంగ్ల మాధ్యమం) మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ దరఖాస్తులు కోరుతోంది. ఇందుకు సంబంధించి ఏపీఆర్‌డీసీ సెట్-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హులైన విద్యార్థులు మార్చి 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్నవారికి ఏప్రిల్ 25వ తేదీన ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు.
ప్రవేశ వివరాలు:
* ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024
గ్రూపు, సీట్లు: బీఏ(హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్)- 40 సీట్లు; బీకాం- 40 సీట్లు; బీఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)- 36 సీట్లు; బీఎస్సీ(మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్)- 36 సీట్లు.
మొత్తం సీట్ల సంఖ్య: 152.
అర్హత: 2023-24 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రమాణాలు: కామన్ ఎంట్రన్స్ టెస్ట్, రిజర్వేషన్ ఆధారంగా.
పరీక్ష ఫీజు:
ఆన్‌లైన్ దరఖాస్తు :రూ.300.
ముఖ్య తేదీలు… ప్రారంభం: 01.03.2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.03.2024.
హాల్ టికెట్‌ల జారీ: 12.05.2023.
ప్రవేశ పరీక్ష తేదీ: 25.04.2024.
మెరిట్ జాబితా వెల్లడి: 14.05.2024.
మొదటి దశ కౌన్సెలింగ్ తేదీ: 23.05.2024.
రెండో దశ కౌన్సెలింగ్ తేదీ: 31.05.2024.
మూడో దశ కౌన్సెలింగ్ తేదీ: 07.06.2024.
APRDC CET 2023 B.A. E&T Model Paper | Click Here |
---|---|
APRDC CET 2023 B.com E&T Model Paper | Click Here |
APRDC CET 2023 B.Sc. (MPC) E&T Model Paper | Click Here |
APRDC CET 2023 B.Sc. (MScs) E&T Model Paper | Click Here |
Thanks for reading APRDC CET 2024 Notification
No comments:
Post a Comment