APRJC CET 2024 Notification
APRJC CET: ఏపీ ఆర్‌జేసీ సెట్-2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 10 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్(ఆంగ్ల మాధ్యమం) మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ దరఖాస్తులు కోరుతోంది. ఇందుకు సంబంధించి ఏపీ ఆర్‌జేసీ సెట్-2024 నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 10(బాలురు, బాలికలు) గురుకుల జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హులైన విద్యార్థులు మార్చి 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్నవారికి ఏప్రిల్ 25వ తేదీన ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఈఈటీ, సీజీటీ గ్రూపుల్లో చేరేందుకు అర్హులు.
వివరాలు..
* ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024
గ్రూప్స్: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఈఈటీ, సీజీటీ.
మొత్తం సీట్ల సంఖ్య: 1,149.
అర్హత: 2023-24 విద్యా సంవత్సరం పదోతరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్, స్పెషల్ కేటగిరీ, స్థానికత ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
పరీక్ష విధానం: ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. విద్యార్థులు ఎంపిక చేసుకునే గ్రూప్ ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2.30 గంటలు. ప్రశ్నపత్రం తెలుగు/ ఇంగ్లిష్, ఉర్దూ/ ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటుంది. పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు.
దరఖాస్తు ఫీజు: రూ.300.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 01.03.2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.03.2024. 05.04.24
హాల్‌టికెట్ జారీ తేదీ: 17.04.2024.
ప్రవేశ పరీక్ష తేదీ: 25.04.2024.
ఫలితాల ప్రకటన: 14.05.2024.
మొదటి దశ కౌన్సెలింగ్ తేదీలు: 20.05.2024 నుంచి 22.05.2024 వరకు.
రెండో దశ కౌన్సెలింగ్ తేదీలు: 28.05.2024 నుంచి 30.05.2024 వరకు.
మూడో దశ కౌన్సెలింగ్ తేదీలు: 05.06.2024 నుంచి 07.06.2024 వరకు.
Thanks for reading APRJC CET 2024 Notification
No comments:
Post a Comment