Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, March 30, 2024

SSC JE 2024 Notification Out for 968 Junior Engineer Posts, Apply Now


Staff Selection Commission(SSC) invites applications for the recruitment JE Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 968 జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు 

సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో డిప్లొమా, సంబంధిత కోర్సుల్లో ఇంజినీరింగ్‌ చదివినవారికి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ జూనియర్‌ ఇంజినీర్ ఉద్యోగ నియామకాలకు ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా ఉద్యోగం పొందినవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు/ శాఖల్లో గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల్లో నియమితులవుతారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్‌ 18వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

వివరాలు...

*  జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పరీక్ష 2024

శాఖల వారీగా ఖాళీలు:

1. జూనియర్ ఇంజినీర్ (సి), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (పురుషులకు మాత్రమే): 438 పోస్టులు

2. జూనియర్ ఇంజినీర్ (ఇ & ఎం), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (పురుషులకు మాత్రమే): 37 పోస్టులు

3. జూనియర్ ఇంజినీర్ (సి), బ్రహ్మపుత్ర బోర్డు, జల శక్తి మంత్రిత్వ శాఖ: 02 పోస్టులు

4. జూనియర్ ఇంజినీర్ (ఎం), సెంట్రల్ వాటర్ కమిషన్: 12 పోస్టులు

5. జూనియర్ ఇంజినీర్ (సి), సెంట్రల్ వాటర్ కమిషన్: 120 పోస్టులు

6. జూనియర్ ఇంజినీర్ (ఇ), సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్: 121 పోస్టులు

7. జూనియర్ ఇంజినీర్ (సి), సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్: 217 పోస్టులు

8. జూనియర్ ఇంజినీర్ (ఇ), సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ స్టేషన్): 02 పోస్టులు

9. జూనియర్ ఇంజినీర్ (సి), సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ స్టేషన్: 03 పోస్టులు

10. జూనియర్ ఇంజినీర్ (ఎం), డీజీక్యూఏ- నావల్‌, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్: 03 పోస్టులు

11. జూనియర్ ఇంజినీర్ (ఇ), డీజీక్యూఏ- నావల్‌, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్: 03 పోస్టులు

12. జూనియర్ ఇంజినీర్ (ఇ), ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, జల శక్తి మంత్రిత్వ శాఖ: 02 పోస్టులు

13. జూనియర్ ఇంజినీర్ (సి), ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, జల శక్తి మంత్రిత్వ శాఖ: 02 పోస్టులు

14. జూనియర్ ఇంజినీర్ (సి), మిలిటరీ ఇంజినీర్ సర్వీస్: తర్వాత తెలియజేస్తారు. 

15. జూనియర్ ఇంజినీర్ (ఇ & ఎం), మిలిటరీ ఇంజనీర్ సర్వీస్: తర్వాత తెలియజేస్తారు. 

16. జూనియర్ ఇంజినీర్ (సి), నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్: 06 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 968.

అర్హతలు: డిప్లొమా (సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌) తత్సమానం లేదా డిగ్రీ (సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌) చదివినవారు అర్హులు. 

గరిష్ఠ వయోపరిమితి: సీపీడబ్ల్యూడీ విభాగం పోస్టులకు- 32 ఏళ్లు; ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. వివిధ కేటగిరీలవారికి వయోపరితుల్లో సడలింపులు ఉన్నాయి. 

జీత భత్యాలు: సెవెన్త్‌ పే స్కేలు ప్రకారం రూ.35,400- రూ.1,12,400 ఉంటుంది.

ఎంపిక విధానం: పేపర్‌-1, పేపర్‌-2 రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: ఇది రెండు అంచెల్లో ఉంటుంది. పేపర్‌-1, పేపర్‌-2 ఉంటాయి. పేపర్‌-1, 2 ఆన్‌లైన్‌ విధానంలో(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) ఆబ్జెక్టివ్‌ తరహాలో నిర్వహిస్తారు. పేపర్‌-1లో మొత్తం 200 మార్కులకు.. 200 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్‌ రీజనింగ్ (50 ప్రశ్నలు- 50 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (50 ప్రశ్నలు- 50 మార్కులు), జనరల్ ఇంజినీరింగ్ (100 ప్రశ్నలు- 100 మార్కులు)విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. పేపర్‌-2 మొత్తం 300 మార్కులకు జరుగుతుంది. జనరల్‌ ఇంజినీరింగ్‌ విభాగం (100 ప్రశ్నలు- 300 మార్కులు) నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం రెండు గంటలు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షకేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

దరఖాస్తు ఫీజు: రూ.100(మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల తేదీలు: 28-03-2024 నుంచి 18-04-2024 వరకు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18-04-2024.

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 19-04-2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 22-04-2024 నుంచి 23-04-2024 వరకు.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్-I): 04-06-2024 నుంచి 06-06-2024 వరకు.

టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్: 180 030 930 63.

Official website Here

Notification Here

Thanks for reading SSC JE 2024 Notification Out for 968 Junior Engineer Posts, Apply Now

No comments:

Post a Comment