TCS: టీసీఎస్‌లో ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు
* రూ.3.36 - రూ.11.5 లక్షల వార్షిక వేతనం
* ఏప్రిల్ 10 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువు
ప్రముఖ ఐటీ సంస్థ- టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)... దేశ వ్యాప్తంగా టీసీఎస్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్-2024 (TCS NQT)ను నిర్వహిస్తోంది. ఈ టెస్ట్ ద్వారా ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ ఫ్రెషర్లను వివిధ కేటగిరీ కొలువుల్లో నియమించనున్నారు. పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రైమ్, డిజిటల్, నింజా విభాగాలకు ఎంపికవుతారు. అర్హులైన ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు (Freshers) ఏప్రిల్ 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎంపిక చేసుకున్న నగరాల్లో ఏప్రిల్ 26న రాత పరీక్ష (Written Test) ఉంటుంది. అభ్యర్థులు ఏదైనా విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బీటెక్/ బీఈ/ ఎంటెక్/ ఎంఈ/ ఎంసీఏ/ ఎంఎస్సీ/ ఎంఎస్ ఉత్తీర్ణలై ఉండాలి. వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికవుతారు. ప్రైమ్ విభాగంలో ఎంపికైతే యూజీకి రూ.9 లక్షలు, పీజీకి రూ.11.5 లక్షలు; డిజిటల్ (Digital) విభాగంలో యూజీకి రూ.7లక్షలు, పీజీకి రూ.7.03 లక్షలు; నింజా విభాగంలో యూజీకి రూ.3.36 లక్షలు, పీజీకి రూ.3.53 లక్షల వార్షిక వేతనం (Salary) ఉంటుంది.
Thanks for reading TCS: Jobs for Freshers in TCS
No comments:
Post a Comment