BSF: బీఎస్‌ఎఫ్‌లో 1,526 ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ, ఏఆర్)లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్, వారెంట్ ఆఫీసర్, హవల్దార్ (క్లర్క్) ఖాళీల భర్తీకి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంక్షిప్త ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. అస్సాం రైఫిల్ ఎగ్జామినేషన్-2024 ద్వారా ఖాళీలు భర్తీ చేయనున్నారు. అర్హులైన పురుష/ మహిళా అభ్యర్థులు జులై 8వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు…
1. హెడ్ కానిస్టేబుల్ (హెచ్‌సీ) (మినిస్టీరియల్/ కంబాటెంట్ మినిస్టీరియల్), హవల్దార్ (క్లర్క్): 1,283 పోస్టులు
2. అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఏఎస్సై)- (స్టెనోగ్రాఫర్/ కంబాటెంట్ స్టెనోగ్రాఫర్), వారెంట్ ఆఫీసర్ (పర్సనల్ అసిస్టెంట్): 243 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 1,526.
అర్హత: పోస్టును అనుసరించి 12వ తరగతి ఉత్తీర్ణత, టైపింగ్, స్టెనోగ్రఫీ సర్టిఫికెట్, నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 09-06-2024.
దరఖాస్తుకు చివరి తేదీ: 08-07-2024.
Thanks for reading Border Security Force (BSF) Head Constable (Ministerial/ Combatant Ministerial) & ASI (Stenographer) Recruitment- 2024
No comments:
Post a Comment