Central Bank of India - 484 Safai Karmchari Sub-Staff posts
Central Bank: సెంట్రల్ బ్యాంకులో 484 సఫాయి కర్మచారి/ సబ్-స్టాఫ్ పోస్టులు
ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్- దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు జూన్ 27వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు:
* సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్: 484 పోస్టులు
జోన్ల వారీగా ఖాళీలు: అహ్మదాబాద్- 76; భోపాల్- 38, దిల్లీ- 76, కోల్‌కతా- 2, లఖ్‌నవూ- 78, ఎంఎంజడ్‌వో & పుణె- 118, పట్నా- 96.
అర్హత: ఎస్‌ఎస్‌సీ/ పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 31.03.2023 నాటికి 18 - 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్ల, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
పే స్కేల్: నెలకు రూ.19,500 - రూ.37,815.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష(70 మార్కులు), లోకల్ లాంగ్వేజ్ టెస్ట్(30 మార్కులు), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ పరీక్ష ఆంగ్ల మాధ్యమంలో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్, ఎలిమెంటరీ అరిథ్‌మెటిక్, సైకోమెట్రిక్ టెస్ట్(రీజనింగ్) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు.
దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు రూ.175. ఇతరులకు రూ.850.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 21.06.2024.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 27-06-2024
ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఎగ్జామ్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: జులై 2024.
ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్: జులై 2024.
ఆన్‌లైన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: జులై/ ఆగస్టు 2024.
ఆన్‌లైన్ పరీక్ష: జులై/ ఆగస్టు 2024.
పరీక్ష ఫలితాల వెల్లడి: ఆగస్టు 2024.
లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: సెప్టెంబర్ 2024.
లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ (జోన్ల వారీగా): సెప్టెంబర్ 2024.
ప్రొవిజనల్ సెలెక్షన్: అక్టోబర్ 2024.
Thanks for reading Central Bank of India - 484 Safai Karmchari Sub-Staff posts
No comments:
Post a Comment