Jobs in Mazgaon Dock Shipbuilders Ltd., an Indian public sector company based in Mumbai.
MDSL: ఎండీఎస్‌ఎల్‌లో 518 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు
ముంబయిలోని మాజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్… కింది ట్రేడుల్లో ట్రేడ్ అప్రెంటిస్(గ్రూప్-ఎ, బి, సి) ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
* ట్రేడ్ అప్రెంటిస్(గ్రూప్-ఎ, బి, సి): 518 ఖాళీలు
ట్రేడ్‌లు: డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్), ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, పైప్ ఫిట్టర్, స్ట్రక్చరల్ ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెల్డర్, కార్పెంటర్, రిగ్గర్, వెల్డర్ ఎలక్ట్రికల్ తదితరాలు.
అర్హత: ఖాళీని అనుసరించి ఎనిమిదో తరగతి, పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01-10-2024 నాటికి గ్రూప్ ఎ- 15-19 ఏళ్లు; గ్రూప్ బి- 16-21 ఏళ్లు. గ్రూప్ సి- 14-18 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్: నెలకు గ్రూప్ ఎ- రూ.6600. గ్రూప్ బి- రూ.8050-రూ.7700. గ్రూప్ సి- రూ.2500-రూ.5500.
దరఖాస్తు రుసుము: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్/ట్రేడ్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02-07-2024.
హాల్‌టికెట్ల జారీ: 26-07-2024.
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 10-08-2024.
Thanks for reading Jobs in Mazgaon Dock Shipbuilders Ltd., an Indian public sector company based in Mumbai.
No comments:
Post a Comment