Jobs in Banks :Institute of Banking Personnel Selection (IBPS) released a notification
IBPS Clerk: ఐబీపీఎస్ క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
* జులై 1- 21 తేదీల్లో దరఖాస్తు ప్రక్రియ
* ఆగస్టులో ప్రిలిమ్స్.. అక్టోబర్‌లో మెయిన్స్
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్)... 2025-2026 సంవత్సరానికి సంబంధించి కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్(సీఆర్‌పీ)-XIV నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టనుంది. ఈ మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఖాళీలుంటాయి. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో జులై 1వ తేదీ నుంచి 21 తేదీల మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టులో ప్రిలిమ్స్, అక్టోబర్‌లో మెయిన్స్ నిర్వహించనున్నారు.
వివరాలు...
* ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయసు: 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ తదితరాలు.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 01.07.2024 నుంచి 21.07.2024 వరకు.
ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ నిర్వహణ తేదీలు: 12.08.2024 నుంచి 17.08.2024 వరకు.
ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: 24.08.2024, 25.08.2024, 31.08.2024.
ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల విడుదల: సెప్టెంబర్, 2024.
ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష తేదీ: 13.10.2024.
Thanks for reading Jobs in Banks :Institute of Banking Personnel Selection (IBPS) released a notification
No comments:
Post a Comment