PNB Apprentice: పంజాబ్ నేషనల్ బ్యాంకులో 2,700 అప్రెంటిస్ ఖాళీలు
న్యూదిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం, మానవ వనరుల విభాగం... దేశ వ్యాప్తంగా పీఎన్‌బీ శాఖల్లో 2,700 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో జులై 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రకటన వివరాలు:
* అప్రెంటిస్: 2,700 ఖాళీలు (ఏపీలో 27, తెలంగాణలో 34 ఖాళీలు ఉన్నాయి)
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయస్సు: 30.06.2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
స్టైపెండ్: నెలకు రూరల్/ సెమీ అర్బన్ ప్రాంతానికి రూ.10,000. పట్టణ ప్రాంతానికి రూ.12,000. మెట్రో ప్రాంతానికి రూ.15,000.
శిక్షణ వ్యవధి: ఏడాది.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది.
ఆన్‌లైన్ రాత పరీక్ష: జనరల్/ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), జనరల్ ఇంగ్లిష్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), కంప్యూటర్ నాలెడ్జ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు).
పరీక్ష వ్యవధి: 60 నిమిషాలు.
పరీక్ష మాధ్యమం: ఇంగ్లిష్ / హిందీ.
దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీలకు రూ.944. మహిళలు/ ఎస్సీ/ ఎస్టీలకు రూ.708. దివ్యాంగులకు రూ.472.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 30.06.2024.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 14.07.2024.
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 28.07.2024.
Thanks for reading PNB Recruitment 2024 Notification Out for 2700 Punjab National Bank Apprentice Vacancy Apply Online Now
No comments:
Post a Comment