Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, July 10, 2024

Are you going to work abroad? Beware of fake agents.. Check this first.


విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్తున్నారా..? నకిలీ ఏజెంట్లతో జాగత్త.. ముందు ఇలా చెక్ చేయండి.

మెరుగైన ఉపాధి కోసం చాలా మంది భారతీయులు విదేశాలకు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. జీతాలు లాభదాయకంగా ఉండటమే అందుకు కారణం. అయితే కొంత మంది నకిలీ ఏజెంట్ల చేతుల్లో మోసపోతూ, ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

మోసపూరిత ఏజెంట్లు విదేశాల్లో ఉద్యోగాలు కోరుకునే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటారు. మంచి జీతం వస్తుందని నమ్మబలికి భారీగా డబ్బు వసూలు చేస్తారు. ఏదో ఒక మార్గంలో వారిని అక్కడికి పంపిస్తారు. తీరా విదేశాలకు వెళ్తే అక్కడ పరిస్థితులు అధ్వానంగా ఉంటాయి. పనికి తగ్గ వేతనం అందక, సమయానికి తిండి లేక అల్లాడుతుంటారు. అందుకే విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లేవారు మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీని గురించి భారత ప్రభుత్వం గతేడాది చివరిలో అడ్వైజరీ జారీ చేసింది.

రష్యాలో ఉద్యోగం పేరుతో మోసం:

ఇటీవల రష్యాలో మంచి జీతంతో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చాలామంది ఏజెంట్లు సామాన్యులను మోసం చేశారు. ఈ స్కామ్‌లో భారతీయులు మోసపోయిన ఘటన బయటకు వచ్చింది. మంచి ఉద్యోగం వచ్చిందనే ఆశతో కొందరు వ్యక్తులు అక్కడికి వెళ్తే, రష్యా సైన్యంలో చేరాలని ఒత్తిడి చేశారు. గత్యంతరం లేక ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధంలో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్‌లోని కలింగ్‌పాంగ్‌కు చెందిన ఒక మాజీ సైనికుడు అందుకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియా‌లో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

యుద్ధభూమిలో నరకం:

రష్యాలో సెక్యూరిటీ గార్డులుగా ఉద్యోగం ఇప్పిస్తామని నకిలీ ఏజెంట్లు మొదటగా హామీ ఇచ్చారు. అది నిజమని నమ్మి కొంత మంది రష్యా వెళ్లారు. కానీ అక్కడికి వెళ్లాక సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం కాకుండా ఉక్రెయిన్ యుద్ధంలో సైనికులుగా సేవలు అందించాలని వారిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధంలో పాల్గొన్నారు. ఇలాంటి మోసపూరిత ఉద్యోగ హామీలపై అవగాహన కల్పించడం కోసం భారత విదేశాంగ శాఖ 2023 డిసెంబర్‌‌‌లో అడ్వైజరీ జారీ చేసింది. నకిలీ జాబ్ ఆఫర్స్ బారిన పడకుండా ఉండేందుకు తగిన సూచనలు చేసింది.

ఏజెంట్ రిజిస్ట్రేషన్ నంబర్:

ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారు, ఏజెంట్ వివరాలను తెలుసుకోవాలి. విదేశాంగ శాఖలో ఏజెంట్‌గా నమోదు చేసుకున్నారా లేదా పరిశీలించాలి. ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ నంబర్ చెక్ చేయడానికి emigrate.gov.in అనే భారత ప్రభుత్వ వెబ్‌సైట్‌ను విజిట్ చేయాలి. అసలైన ఏజెంట్ల రిజిస్ట్రేషన్ నంబర్లు ఈ వెబ్‌సైట్‌లో లిస్ట్ అయి ఉంటాయి.

డబ్బులు డిమాండ్ చేయడం:

ఇమ్మిగ్రేషన్ చట్టం-1983 ప్రకారం.. విదేశాల్లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి గరిష్టంగా రూ.30,000 వసూలు చేయడానికి ఏజెంట్లకు అనుమతి ఉంటుంది. అయితే అంతకు మించి డబ్బులు డిమాండ్ చేస్తే అనుమానించాలి. ప్రత్యేకించి రిజిస్ట్రేషన్ ఫీజుల ముసుగులో ఎక్కువ డబ్బు అడగవచ్చు.

ఆఫర్ లెటర్ వెరిఫికేషన్:

విదేశీ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికైన తరువాత అభ్యర్థులు తమ ఆఫర్ లెటర్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి. విదేశీ వ్యవహారాల శాఖ అడ్వైజరీ ప్రకారం.. ఆఫర్ లెటర్‌లో ఉద్యోగ నిబంధనలు, షరతులతో పాటు జీతం, జాబ్ కాంట్రాక్ట్ వివరాలు ఉండాలి. ఇవి లేకపోతే ఆఫర్ లెటర్ మోసపూరితమని గ్రహించాలి.

Thanks for reading Are you going to work abroad? Beware of fake agents.. Check this first.

No comments:

Post a Comment