Budget 2024: నిర్మలమ్మ బడ్జెట్ లో ధరలు తగ్గేవి...ధరలు పెరిగేవి ఇవే..(Cheaper & Costlier)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆమె ప్రసంగంలో ప్రధానంగా ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రజలు తమ విశ్వాసాన్ని వ్యక్తం చేసి చారిత్రాత్మకంగా మూడవసారి ఆయనను తిరిగి ఎన్నుకున్నారని పేర్కొని ప్రసంగం ప్రారంభించారు.
అంతేకాదు పేదలు, మహిళలు, యువత, రైతులపై తమ ప్రభుత్వం దృష్టి సారించింది అని పేర్కొన్నారు. అయితే 2 లక్షల కోట్ల కేటాయింపు ద్వారా ఉపాధి, నైపుణ్యాన్ని సులభతరం చేసేందుకు ఐదు పథకాల ప్రధానమంత్రి ప్యాకేజీని ఆర్థిక మంత్రి ప్రకటించారని గుర్తు చేశారు.
బడ్జెట్ సందర్భంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పన్ను మినహాయింపులు అలాగే ఎగుమతి, దిగుమతులపై సుంకాల మార్పులు పలు వస్తువుల ధరలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. ఈ నేపథ్యంలో పలు వస్తువుల ధరలు పెరుగుతాయి. మరికొన్ని తగ్గుతాయి. వాటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ధరలు పెరిగేవి:
బంగారం, వెండి, వజ్రాల ఆభరణాలు
ప్లాటినం వస్తువులు
బంగారు కడ్డీలు
వన్గ గ్రాం గోల్డ్ ఆభరణాలు
సిగరెట్
వంటగది చిమ్నీలు
కాంపౌండ్ రబ్బరు
కాపర్ స్క్రాప్
ధరలు తగ్గేవి:
లిథియం బ్యాటరీలు
ఎలక్ట్రిక్ వాహనాలు
మొబైల్ ఫోన్లు
బొమ్మలు
సైకిళ్ళు
చిమ్నీ హీట్ కాయిల్
ఆర్టిఫిషియల్ వజ్రాలు
Thanks for reading Budget 2024: నిర్మలమ్మ బడ్జెట్ లో ధరలు తగ్గేవి...ధరలు పెరిగేవి ఇవే..(Cheaper & Costlier)
No comments:
Post a Comment