Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, July 25, 2024

How To Identify Adulterated Cooking Oil


మీరు వాడుతున్న వంట నూనె మంచిదా? - కల్తీ చేశారా? - ఇలా ఈజీగా తెలుసుకోండి!

How To Identify Adulterated Cooking Oil : మనం వంట చేయాలంటే తప్పకుండా ఉండాల్సిన పదార్థాల్లో నూనె ఒకటి. ఇది క్వాలిటీగా ఉంటేనే ఆహారం రుచికరంగా, హెల్దీగా ఉంటుంది. కానీ.. ప్రస్తుత కాలంలో కల్తీ రాజ్యమేలుతోంది. ఈ కల్తీ ఆయిల్ తినడం వల్ల ఎన్నో ప్రమాదకరమైన రోగాలు చుట్టు ముడతాయి. కానీ.. తినే ఆయిల్ మంచిదా? కల్తీ అయ్యిందా? అన్నది గుర్తించడం చాలా మందికి సాధ్యం కాదు. అందుకే.. ఇంట్లోనే కొన్ని టెస్టులు చేసి తెలుసుకోవచ్చని FSSAI (ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆఫ్‌ ఇండియా) చెబుతోంది. మరి.. ఆ పరీక్షలేంటో ఇప్పుడు చూద్దాం.

సీల్‌ను గమనించండి :

మార్కెట్‌లో నూనె కొనుగోలు చేసేటప్పుడు బాటిల్ మూత సరిగ్గా సీల్‌ వేసి ఉందో లేదో ఒకసారి పరిశీలించండి. సీల్‌ వదులుగా క్యాప్‌ తీసి ఉంటే.. దానిలో కల్తీ నూనె కలిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీలైనంత వరకు విడిగా ఉండే నూనె కొనకండి. మంచి బ్రాండెడ్‌ కంపెనీ నూనెను కొనుగోలు చేయండి.

రంగును పరిశీలించండి :

మంచి నూనెలు నిర్దిష్టమైన రంగు, స్పష్టతను కలిగి ఉంటాయి. ఉదాహరణకు.. ఆలివ్ నూనె "ఆకుపచ్చ బంగారు" రంగులో ఉంటుంది. పొద్దుతిరుగుడు నూనె లేత పసుపు రంగులో ఉంటుంది. ఇలా కాకుండా ఆయిల్‌ రంగు వేరేలా ఉంటే కల్తీ చేశారని గుర్తించాలి.

వాసన బాగుంటుంది :

కల్తీ చేయని నూనె మంచి వాసన వస్తుంది. ఉదాహరణకు, ఆలివ్‌ నూనె తాజా పండ్ల వాసన వస్తుంది. ఒక వేళ నూనె దుర్వాసన వస్తుంటే.. అది కచ్చితంగా కల్తీ చేశారని గుర్తించాలి.

ఫ్రిజ్‌లో పెట్టండి :

మీరు ఉపయోగించే ఆయిల్‌ స్వచ్ఛమైనదా లేదా అనేది తెలుసుకోవడానికి.. కొద్దిగా నూనెను ఒక క్లియర్‌ కంటైనర్‌లోకి తీసుకోండి. తర్వాత దానిని ఫ్రిజ్‌లో పెట్టండి. మీరు వాడే నూనె స్వచ్ఛమైనది అయితే అది గడ్డకడతుంది. ఆ నూనె కల్తీదైతే ద్రవంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఆలివ్‌ ఆయిల్‌ కూడా :

మీరు ఒకవేళ ఆలివ్‌ ఆయిల్‌ను వాడుతుంటే.. దానిని కంటైనర్‌లోకి తీసుకుని డీప్‌ఫ్రిజ్‌లో పెట్టండి. స్వచ్ఛమైన ఆలివ్ ఆయిల్‌ 30 నిమిషాల్లో గడ్డకడుతుంది.

పేపర్‌పై వేయండి :

మీరు వాడుతున్న ఆయిల్‌ను తెల్ల కాగితంపై కొద్దిగా వేసి ఆరనివ్వండి. అది స్వచ్ఛమైన నూనె అయితే, జిడ్డైన రింగ్ లేకుండా సమానంగా ఉంటుంది.

ఈ టెస్ట్‌ చేయండి :

ఒక టెస్ట్ ట్యూబ్‌లో వంట నూనెను తీసుకొని దానికి 4 మి.లీ డిస్టిల్డ్ వాటర్ కలపండి. తర్వాత టెస్ట్ ట్యూబ్‌ని కొన్ని సెకన్ల పాటు తిప్పండి. ఇప్పుడు మరొక టెస్ట్ ట్యూబ్‌లో 2 ml ఈ డిస్టిల్డ్ వాటర్ ద్రవాన్ని తీసుకుని.. దీనికి 2 ml గాఢమైన హైడ్రోక్లోరిక్ ఆమ్లం (Hydrochloric Acid) కలపండి. నూనె కల్తీ కాకపోతే రంగు మార్పు ఉండదు. ఒకవేళ నూనె కల్తీ అయితే, నూనె పైభాగంలో ఎరుపు రంగు ఏర్పడుతుంది.

కొబ్బరి నూనె కోసం :

కొబ్బరి నూనె స్వచ్ఛతను తనిఖీ చేయడానికి.. ఒక కంటైనర్‌లో కొద్దిగా నూనెను తీసుకొని, 5-10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత సెట్‌ చేసి ఫ్రిజ్‌లో పెట్టండి. స్వచ్ఛమైన కొబ్బరి నూనె అయితే 60-90 నిమిషాలలో అది గడ్డకడుతుంది.

Thanks for reading How To Identify Adulterated Cooking Oil

No comments:

Post a Comment