Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, July 25, 2024

Is Feviquik sticky? Don't worry.. it will be easy if you do this..!


 చేతికి ఫెవీక్విక్‌ అంటుకుందా..? డోంట్‌ వర్రీ.. ఇలా చేస్తే ఈజీగా పోతుంది..!

ఫెవిక్విక్‌ని ఉపయోగం మనందిరికీ తెలుసు..ఫెవిక్విక్‌ ఉపయోగంతో మనం విరిగిన వస్తువులను అతికిస్తుంటాం. ఏదైనా విరిగిన వస్తువులు, బొమ్మలు వంటివాటిని అంటించడానికి ఫెవిక్విక్‌ని ఉపయోగించినప్పుడు.. చిన్న పొరపాటు జరిగితే.. అది మన చేతులకు కూడా అంటుకుపోతుంది. అలాంటప్పుడు దానిని తీసివేయటం కాస్త కష్టంగానే ఉంటుంది. అయితే, చేతులు, కాళ్ల చర్మం నుండి ఫెవిక్విక్‌ను ఎలా తొలగించాలి? ఫెవిక్విక్ మీ చేతులు లేదా చర్మంపై పడితే, దాన్ని తీసివేయడం చాలా కష్టం అవుతుంది. మీకు అలాంటి పరిస్థితి ఎదురైతే..ఏం చేయాలో మీ కోసం ఒక ఉపాయం తీసుకువచ్చాము. దీని సహాయంతో మీరు కొన్ని సెకన్లలో మీ చర్మంపై పడిన ఫెవిక్విక్‌ను ఈజీగా తొలగించవచ్చు.

ఫెవిక్విక్‌ను వదిలించుకోవడానికి సులభమైన మార్గం..

ఫెవిక్విక్ చర్మంపై పడితే ఎలా వదిలించుకోవాలో తెలుసా? సులువైన ఉపాయంతో ఒక ఉపాధ్యాయుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆమె పిల్లల చేతుల్లో ఇరుక్కున్న ఫెవిక్విక్‌ను వదిలించడానికి సులభమైన మార్గాన్ని చెబుతోంది. మీ చేతికి ఫెవిక్విక్ అంటినట్టయితే.. ప్రతి ఇంట్లో ఉండే ఒక వస్తువును వెంటనే ఉపయోగించాలని వీడియోలో మహిళ చెప్పింది. అదేంటంటే.. ఉప్పు. ఒంటిపై ఎక్కడైనా ఫెవిక్విక్‌ అంటినట్టయితే..ఉప్పు రాయటం వల్ల దాని పట్టు సడలుతుంది. ఫెవిక్విక్ ఊడిపోతుందని చెప్పింది. అలాగే, మీరు దానిని నెయిల్ పెయింట్ రిమూవర్‌ని ఉపయోగించి కూడా తొలగించవచ్చు. ఇది మాత్రమే కాదు, చర్మం నుండి ఫెవిక్విక్‌ను తొలగించడానికి వెనిగర్ కూడా ఉపయోగించవచ్చు. నిమ్మ, వనస్పతి చర్మం నుండి ఫెవిక్విక్‌ను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

మీరు ఫెవిక్విక్‌ని తొలగించడానికి వెచ్చని నీరు, సబ్బును కూడా ఉపయోగించవచ్చు. ఈ రెండింటి మిశ్రమంలో మీ చేతులను కాసేపు ముంచి కాటన్‌తో నెమ్మదిగా శుభ్రం చేసుకోవాలి. కొంత సేపటికి మీ చర్మం నుండి ఫెవిక్విక్‌ ఈజీగా పోతుంది.

Thanks for reading Is Feviquik sticky? Don't worry.. it will be easy if you do this..!

No comments:

Post a Comment