Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, July 25, 2024

LIC HFL Junior Assistant Recruitment 2024 Notification Out for 200 Vacancy Apply Online


 LIC HFL: ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌లో 200 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (HFL)… దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ పరిధిలో 12, తెలంగాణ పరిధిలో 31 జేఏ ఖాళీలున్నాయి. ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.800 చెల్లించి.. జులై 25 నుంచి ఆగస్టు 14 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

రాష్ట్రం- ఖాళీల సంఖ్య:

‣ ఆంధ్రప్రదేశ్- 12 ‣ గుజరాత్- 5 ‣ కర్ణాటక- 38

‣  అస్సాం- 5 ‣ హిమాచల్ ప్రదేశ్- 3 ‣ మధ్యప్రదేశ్- 12

‣ ఛత్తీస్‌గఢ్- 6 ‣ జమ్మూ కశ్మీర్- 1 ‣ మహారాష్ట్ర- 53

 ‣ పుదుచ్చేరి- 1 ‣ సిక్కిం- 1 ‣తమిళనాడు- 10

‣ తెలంగాణ- 31 ‣ ఉత్తరప్రదేశ్- 17 ‣ పశ్చిమ బెంగాల్- 5

‣ మొత్తం ఖాళీలు: 200.

‣ అర్హత: కనీస 60% మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ సిస్టమ్స్‌ ఆపరేటింగ్, వర్కింగ్ నాలెడ్జ్‌ తప్పనిసరి. కంప్యూటర్‌ ఆపరేషన్స్‌/ లాంగ్వేజ్‌లలో సర్టిఫికెట్‌/ డిప్లొమా/ డిగ్రీ చదివి ఉండాలి. 

‣ వయస్సు: 01.07.2024 నాటికి 21-28 సంవత్సరాల మధ్య ఉండాలి.

‣ వేతనం: పని ప్రదేశం ఆధారంగా నెలకు రూ.32,000 నుంచి రూ.35,200 ఉంటుంది.

‣ దరఖాస్తు రుసుము: రూ.800.

‣ ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

‣ ఆన్‌లైన్ పరీక్ష: ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), లాజికల్ రీజనింగ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), న్యూమరికల్ ఎబిలిటీ (40 ప్రశ్నలు- 40 మార్కులు), కంప్యూటర్ స్కిల్ (40 ప్రశ్నలు- 40) మార్కులు).

‣ పరీక్ష వ్యవధి: 120 నిమిషాలు.

‣ పరీక్ష మాధ్యమం: ఇంగ్లిష్.

‣ తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, గుంటూరు/ విజయవాడ, రాజమహేంద్రవరం, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కడప, హైదరాబాద్/ సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్.

‣ దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లికేషన్‌ షెడ్యూల్:

‣ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 25.07.2024.

‣  ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువు తేదీ: 14.08.2024.

‣  ఆన్‌లైన్ పరీక్ష నిర్వహణ: సెప్టెంబర్ 2024.

ముఖ్యాంశాలు

‣ జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌ నియామక ప్రక్రియ చేపట్టింది. 

‣ ఏపీ పరిధిలో 12, తెలంగాణ పరిధిలో 31 ఖాళీలున్నాయి. 

‣ ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. 

‣ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.800 చెల్లించి ఆగస్టు 14 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

Website Here

Notification Here

Online Application

Thanks for reading LIC HFL Junior Assistant Recruitment 2024 Notification Out for 200 Vacancy Apply Online

No comments:

Post a Comment