Indian Navy Recruitment: ఇంటర్ పాసయ్యారా? నాలుగేళ్ల బీటెక్ డిగ్రీతో పాటు నేవీలో ఉద్యోగం
ఇండియన్ నేవీ ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచుల్లో 10+2(బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కింద నాలుగేళ్ల బీటెక్ డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో శిక్షణ ఉంటుంది.ఎంపికైన అభ్యర్థులకు బీటెక్ డిగ్రీతోపాటు ఉద్యోగం కల్పిస్తారు.
మొత్తం ఖాళీలు: 40 (మహిళలకు 8 ఖాళీలు కేటాయించారు)
అర్హత: 70 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (10+2)(ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) ఉత్తీర్ణులవ్వాలి. జేఈఈ మెయిన్–2021కు హాజరై ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
ఎంపిక విధానం: జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా మెరిట్ ర్యాంక్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తులకు చివరి తేది: జులై 20, 2024
వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/
Thanks for reading Indian Navy Recruitment: ఇంటర్ పాసయ్యారా? నాలుగేళ్ల బీటెక్ డిగ్రీతో పాటు నేవీలో ఉద్యోగం
No comments:
Post a Comment