Mouth Smell: నోటి దుర్వాసనతో ఇబ్బందిగా ఉంటుందా.. ఇకపై నో టెన్షన్!
మీకు తెలుసా.. నోటి ఆరోగ్యం శరీర ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది. నోటి నుంచి దుర్వాసన వస్తుందంటే.. ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. చాలా మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. నోటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్నా.. కొంత మంది నోటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. కొంత మందికి అనారోగ్య పరిస్థితుల వల్ల కూడా తరచుగా నోటి నుంచి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. దీంతో నలుగురిలో మాట్లాడేందుకు ఇబ్బంది పడుతూ ఉంటారు. అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉంటారు. అసలు నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది? రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
నీటిని ఎక్కువగా తాగాలి:
నీటిని తక్కువగా తీసుకోవడం వల్ల కూడా నోటి నుంచి దుర్వాసన అనేది వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నీళ్లు ఎక్కువగా తీసుకుంటే నోటిలో ఉండే బ్యాక్టీరియా నశించడమే కాకుండా.. నోరు కూడా శుభ్రంగా ఉంటుంది. నోటి నుంచి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉందంటే.. నీటిని తాగుతూ ఉండాలి. నీటిలో నిమ్మ కాయ రసం కలుపుకుని తాగిని మంచిదే.
గ్రీన్ తాగండి:
నోటి నుంచి దుర్వాసన వస్తున్నవారు భోజనం చేసిన అరగంట లేదా గంట తర్వాత గ్రీన్ తాగడం మంచిది. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్రిములను నాశనం చేస్తాయి. దీంతో నోట్లో ఉండే బ్యాక్టీరియా నశించి.. దుర్వాసన తగ్గుతుంది.
లవంగాలు:
నోటి దుర్వాసన వస్తున్నవారు.. నోటిలో అప్పుడప్పుడు లవంగాలను బుగ్గన పెట్టుకుంటూ ఉండండి. ఇది నోటి దుర్వాసనను తగ్గించడమే కాకుండా నోటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
పుదీనా లేదా తులసి ఆకులు:
నోటి నుంచి బ్యాడ్ స్మెల్ వస్తున్నవారు పుదీనా ఆకులు లేదా తులసి ఆకులు నములుతూ ఉండటం మంచిది. దీని వల్ల నోటి ఆరోగ్యం మెరుగు పడటమే కాకుండా దుర్వాసన తగ్గుతుంది. నోరు ఫ్రెష్‌గా ఉంటుంది.
సోంపు తినండి:
భోజనం చేసిన తర్వాత కొద్దిగా సోంపు తింటూ ఉండండి. దీని వల్ల దుర్వాసన తగ్గి నోరు ఫ్రెష్‌గా ఉంటుంది. అంతేకాకుండా తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. భోజనం చివర్లో పెరుగు అన్నం తినడం వల్ల కూడా నోటి దుర్వాసన తగ్గుతుంది.
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.
Thanks for reading Mouth Smell: Are you troubled by bad breath? No more tension!
No comments:
Post a Comment