Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, July 24, 2024

Tea Vs Coffee - Which of the two is better for health? - Do you know?


 టీ Vs కాఫీ - ఈ రెండిట్లో ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది? - మీకు తెలుసా?

Tea Vs Coffee Which Is Better : ఉదయాన్నే కప్పు టీ లేదా కాఫీ తాగనిదే చాలా మందికి రోజూ మొదలవదు! కాస్త, తలనొప్పిగా ఉన్నా, ఉల్లాసంగా ఉన్న కూడా టీ తాగుతుంటారు. అంతలా టీ, కాఫీలు మన జీవితంలో భాగమయిపోయాయి. మరి.. టీ, కాఫీలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటీ ? ఏది తాగితే ఆరోగ్యానికి మంచిది? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

టీ తాగడం వల్ల ప్రయోజనాలు ఇవే..

రోగనిరోధక శక్తి పెరుగుతుంది:

Teaలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో సహాయపడతాయని, ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయని నిపుణులంటున్నారు.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

కొన్ని రకాల టీలు, ముఖ్యంగా గ్రీన్ టీ, బ్లాక్ టీ వంటివి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్తపోటు అదుపులో ఉండేలా చేస్తాయి.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది :

టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ముఖ్యంగా పుదీనా, అల్లంతో చేసిన టీలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులంటున్నారు. ఇవి మైండ్‌ను రిలాక్స్‌ చేస్తాయని పేర్కొన్నారు.

మెదడు పనితీరు మెరుగుపడుతుంది :

టీలో ఉండే కెఫీన్ మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీనివల్ల మనకు అలసటగా అనిపించినప్పుడు ఒక కప్పు టీ తాగితే ఏకాగ్రత కోల్పోకుండా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఒత్తిడి తగ్గిస్తుంది :

కొన్నిసార్లు మనం పని ఒత్తిడి, బాధల కారణంగా ఒత్తిడిని అనుభవిస్తుంటాము. అయితే, ఇలాంటప్పుడు ఒక కప్పు టీ తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలివే..

మధుమేహం ప్రమాదం తగ్గుతుంది!

కాఫీలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, డయాబెటిస్‌ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రోజూ కాఫీ తాగడం వల్ల టైప్‌-2 డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి :

టీ కంటే కాఫీలో కెఫిన్‌ శాతం ఎక్కువగా ఉంటుంది. కప్పు కాఫీ తాగడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. 2019లో "NPJ Psychological Sciences" జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. కాఫీ తాగడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుందని, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో ఆస్టేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వెస్ట్రన్‌‌కు చెందిన 'డాక్టర్‌ ఆస్ట్రిడ్ మోడ్రిక్-పెర్సివల్' (Dr. Astrid Modric-Percival) పాల్గొన్నారు. కాఫీ తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.

అలాగే డైలీ కాఫీ తాగడం వల్ల పార్కిన్సన్స్‌, అల్జీమర్స్‌ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.

ఇంకా కాలేయం, ప్రోస్టేట్‌ వంటి ప్రాణాంతక క్యాన్సర్‌ వ్యాధుల రాకుండా కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

టీ, కాఫీలలో ఏది ఆరోగ్యానికి మంచిది ?

కాఫీ, టీలు రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆరోగ్యపరంగా రెండింటిలో కూడా చాలా రకాల హెల్త్‌ బెన్‌ఫిట్స్‌ ఉన్నాయి. అయితే, వీటిని ఎక్కువగా తీసుకోకుండా మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Thanks for reading Tea Vs Coffee - Which of the two is better for health? - Do you know?

No comments:

Post a Comment