Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, August 11, 2024

ITBP: ConstablePosts in ITBP


 

ITBP: ఐటీబీపీలో 200 కానిస్టేబుల్ (పైనీర్) పోస్టులు 

ITBP: ఐటీబీపీలో 200 కానిస్టేబుల్ పోస్టులు 

భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ)... వివిధ విభాగాల్లో కానిస్టేబుల్ (పైనీర్‌) పోస్టుల భర్తీకి నియామక ప్రకటనను విడుదలచేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 200 ఖాళీలను భర్తీ చేయనుంది. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఐటీబీపీ ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు సెప్టెంబర్‌ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు:

1. కానిస్టేబుల్ (కార్పెంటర్) (పురుషులు): 61 పోస్టులు

2. కానిస్టేబుల్ (కార్పెంటర్) (మహిళలు): 10 పోస్టులు

3. కానిస్టేబుల్ (ప్లంబర్) (పురుషులు): 44 పోస్టులు

4. కానిస్టేబుల్ (ప్లంబర్) (మహిళలు): 08 పోస్టులు

5. కానిస్టేబుల్ (మేసన్) (పురుషులు): 54 పోస్టులు

6. కానిస్టేబుల్ (మేసన్) (మహిళలు): 10 పోస్టులు

7. కానిస్టేబుల్ (ఎలక్ట్రీషియన్) (పురుషులు): 14 పోస్టులు

8. కానిస్టేబుల్ (ఎలక్ట్రీషియన్) (మహిళలు): 01 పోస్టు

మొత్తం పోస్టుల సంఖ్య: 200.

అర్హతలు: మెట్రిక్యులేషన్/ 10వ తరగతితో పాటు ఐటీఐ (మేసన్/ కార్పెంటర్/ ప్లంబర్/ ఎలక్ట్రీషియన్ ట్రేడ్) ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తప్పనిసరి. 

పే స్కేల్: నెలకు రూ.21,700-రూ.69,100.

వయోపరిమితి: 10-09-2024 నాటికి 18- 23 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ), రాత పరీక్ష, ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ట్రేడ్‌ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్ష రుసుము: యూఆర్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ రూ.100. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

రాత పరీక్ష విధానం: ఆబ్జెక్టి్వ్‌ టైప్‌ పద్ధతిలో పదో తరగతి సిలబస్‌ ఆధారంగా 100 ప్రశ్నలు (100 మార్కులు) అడుగుతారు. 

సబ్జెక్టులు: జనరల్ ఇంగ్లిష్ (20 ప్రశ్నలు- 20 మార్కులు), జనరల్ హిందీ (20 ప్రశ్నలు- 20 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (20 ప్రశ్నలు- 20 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (20 ప్రశ్నలు- 20 మార్కులు), సింపుల్ రీజనింగ్ (20 ప్రశ్నలు- 20 మార్కులు).

ముఖ్య తేదీలు...

* ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 12-08-2024.

*  ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-09-2024.

ముఖ్యాంశాలు:

* ఐటీబీపీలో 200 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నియామక ప్రకటనను వెలువడింది. 

* ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఐటీబీపీ ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. 

* అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 10లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Official Website Here

Notification Here

FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE

Thanks for reading ITBP: ConstablePosts in ITBP

No comments:

Post a Comment