PDIL Recruitment 2024 Notification Out for 57 Degree and Diploma Engineer Posts
PDIL: పీడీఐఎల్‌లో 57 డిప్లొమా, డిగ్రీ ఇంజినీర్ పోస్టులు
నోయిడాలోని ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్‌మెంట్ ఇండియా లిమిటెడ్… కాంట్రాక్ట్ ప్రాతిపదికన పీడీఐఎల్ కార్యాలయాలు/ ప్రాజెక్ట్ సైట్‌లో కింది విభాగాల్లో ఇంజినీర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 11వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
1. డిప్లొమా ఇంజినీర్: 04 పోస్టులు
2. డిగ్రీ ఇంజినీర్: 53 పోస్టులు
విభాగాలు: ఫైర్/ ఇండస్ట్రియల్ సేఫ్టీ, సివిల్ (కన్‌స్ట్రక్షన్), ఎలక్ట్రికల్ (కన్‌స్ట్రక్షన్), ఇన్‌స్పెక్షన్ (ఎలక్ట్రికల్), ఇన్‌స్పెక్షన్ (సివిల్), ఇన్‌స్పెక్షన్ (మెకానికల్), ఇన్‌స్ట్రుమెంటేషన్ (కన్‌స్ట్రక్షన్), మెకానికల్ (కన్‌స్ట్రక్షన్), మెకానికల్ (మెషినరీ).
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్ (సైన్స్ సబ్జెక్టులు), ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.800. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.400.
ముఖ్య తేదీలు…
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11.09.2024.
* వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: అక్టోబర్ మొదటి లేదా రెండో వారం 2024.
* వేదిక: పీడీఐఎల్ భవన్, నోయిడా.
ముఖ్యాంశాలు:
* కాంట్రాక్ట్ ప్రాతిపదికన పీడీఐఎల్ కార్యాలయాలు/ ప్రాజెక్ట్ సైట్‌లో ఇంజినీర్ ఖాళీల నోటిఫికేషన్ వెలువడింది.
* అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 11వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
PDIL Engineers Recruitment Notification
Thanks for reading PDIL Recruitment 2024 Notification Out for 57 Degree and Diploma Engineer Posts
No comments:
Post a Comment